PM Modi: 508 రైల్వేస్టేషన్ల ఆధునికరణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 6న ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని 508 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టునున్నారు. రూ.24,470 కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కేంద్రం ఈ పనులకు చేపడుతోంది. నగరానికి ఇరువైపులా సరైన అనుసంధానం వుండేలా ‘‘సిటీ సెంటర్స్’’గా స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా రైల్వేస్టేషన్ చుట్టూ నగరం లేదా పట్టణ అభివృద్ది కేంద్రీకృతమై వుండేలా ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు. స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుకు ప్రాధాన్యత నిచ్చేలా స్టేషన్ భవనం రూపకల్పన చేయనున్నారు.
Poorna: హీరోయిన్ పూర్ణ కొడుకును చూశారా..ఎంత ముద్దుగా ఉన్నాడో?
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
మరోవైపు ఈ 508 స్టేషన్లు దేశంలోని 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలిగి ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో 55, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22 ఉండగా.. గుజరాత్, తెలంగాణలో 21 ఉన్నాయి. జార్ఖండ్‌లో 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 18, హర్యానాలో 15, కర్నాటకలో 13 ఉన్నాయి. దీంతో పునరుద్ధరణ పనుల ద్వారా రైల్వే ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలను అందించనున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ సర్క్యూలేషన్, ఇంటర్ మోడల్ ఇంటిగ్రేషన్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
Wine Shops Applications: రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్స్ అప్లికేషన్స్ ప్రక్రియ ప్రారంభం
దేశంలో అత్యాధునిక ప్రజా రవాణా సదుపాయాలపై ప్రధాని మోడీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. దేశవ్యాప్తంగా ప్రజా రవాణాకు రైల్వేలు ప్రాధాన్యతనిస్తున్నాయని.. అందుకు రైల్వేస్టేషన్లలో ప్రపంచస్థాయి సౌకర్యాలను అందించాల్సి అవసరం వుందని మోడీ తెలిపారు. దీంతో దేశంలోని 1309 స్టేషన్లను ఆధునికీకరణ చేసేందుకు ‘‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’’ ప్రారంభించారు.
తాజావార్తలు
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!