NTV Telugu Site icon

PM Modi: ఈరోజు 7 కీలక సమావేశాలు నిర్వహించనున్న ప్రధాని మోడీ..

Pm Modi

Pm Modi

లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈరోజు (ఆదివారం) ముఖ్యమైన అంశాలను కవర్ చేసే సుమారు 7 సమావేశాలను నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి సారించి, రెమల్ తుఫాను అనంతర పరిస్థితిని సమీక్షించే సమావేశంతో ప్రారంభం కానుంది.

ఇటీవలి తుఫాను గణనీయమైన నష్టాన్ని మిగిల్చింది. తక్షణ అంచనా, సమన్వయ సహాయక చర్యలు అవసరం. అలాగే.. దేశంలోని వివిధ ప్రాంతాలను ప్రభావితం చేస్తున్న హీట్‌వేవ్ పరిస్థితులపై దృష్టి సారించే సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర ఉష్ణోగ్రతలతో 33 మంది ఎన్నికల అధికారులు చనిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. దేశ వ్యాప్తంగా తీవ్ర ఎండలు, వేడిగాలులతో అనేక మరణాలు నమోదయ్యాయి. జూన్ 5న జరగనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ముందు, భారీ ఎత్తున వేడుకల సన్నాహాలను సమీక్షించేందుకు ప్రధాన మంత్రి సమావేశం నిర్వహించనున్నారు.

Rohit Sharma-Fan: ప్లీజ్ ఏమనొద్దు.. పోలీసులకు రోహిత్ శర్మ రిక్వెస్ట్‌ (వీడియో)!

అదే విధంగా.. ప్రభుత్వ 100 రోజుల ఎన్నికల అనంతర కార్యక్రమానికి సంబంధించిన ఎజెండాను సమీక్షించేందుకు విస్తృత మేధోమథన సెషన్‌ ఉంటుంది. ఈ సెషన్‌లో బీజేపీ రాబోయే రోజుల్లో కీలకమైన విధాన కార్యక్రమాలు, పాలనా వ్యూహాలపై దృష్టి సారించే అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాలతో పాటు.. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈరోజు సమావేశంలో చర్చించనున్నారు.

సమావేశాల్లోని ముఖ్యమైన అంశాలు..
తుపాను అనంతర పరిస్థితి, ఈశాన్య రాష్ట్రాల్లో సమీక్షించేందుకు ప్రధాని మోడీ తొలి సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఆ తర్వాత దేశంలో విపరీతమైన వేడి పరిస్థితులపై సమీక్షించేందుకు మోడీ సమావేశం కానున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లను సమీక్షించేందుకు ప్రధాని సమావేశం కానున్నారు.
అనంతరం 100 రోజుల కార్యక్రమం ఎజెండాను సమీక్షించేందుకు మోదీ సుదీర్ఘ మేధోమథన సమావేశం నిర్వహించనున్నారు.
కొత్త ప్రభుత్వం కోసం 100 రోజుల ఎజెండాను సిద్ధం చేసే కసరత్తును ప్రధాని ప్రారంభించారు.

Show comments