Site icon NTV Telugu

PM Modi: భూటాన్ పర్యటనకు ప్రధాని మోడీ.. ఆ అంశాలపై కీలక చర్చ..

Modi

Modi

భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్‌కు వెళ్లారు. ఇవాళ (శుక్రవారం) ఉదయాన్నే ప్రధాని మోడీ భూటాన్ పర్యటన కోసం ప్రత్యేక విమానంలో బయలు దేరారు. వాస్తవానికి మోదీ భూటాన్ లో నిన్ననే వెళ్లాల్సి ఉండగా.. అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా పడింది. ఈ క్రమంలోనే నేడు వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో భూటాన్ కు మోడీ బయలుదేరి వెళ్లారు. కాగా.. ప్రధాని ఇవాళ, రేపు భూటాన్ లో పర్యటించి.. ద్వైపాక్షిక అంశాలు, ఇరు దేశాల పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చించనున్నారు.

Read Also: Bike Parking: బైకులు అక్కడ పార్క్ చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..!

ఇక, భారతదేశం – భూటాన్‌ల మధ్య సాధారణ ఉన్నత స్థాయి సంబంధాలు మెరుగుపర్చేందుకు, ‘నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ’ లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై భూటాన్ రాజుతో చర్చించనున్నారు. తన పర్యటన సందర్భంగా భూటాన్ రాజు హిస్ మెజెస్టి జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, భూటాన్ నాల్గవ రాజు హిస్ మెజెస్టి జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌లతో నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. అంతేకాకుండా.. భూటాన్ కౌంటర్ షెరింగ్ టోబ్‌గేతో కూడా ఆయన చర్చలు జరపనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇక, భూటాన్‌లో పర్యటన సందర్భంగా గ్యాల్ట్‌సున్ జెట్సన్ పెమా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌ను కూడా మోడీ ప్రారంభించనున్నారు.

Read Also: Om Bheem Bush: ఓం బీమ్ బుష్ – 2 కూడా రాబోతోందా..?

అయితే, భూటాన్ లో గ్యాల్ట్‌సున్ జెట్సన్ పెమా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ భారత ప్రభుత్వ సహకారంతో భూటాన్ లో నిర్మించారు. ఈ నెల ప్రారంభంలో భూటాన్ ప్రధాని ఐదు రోజుల భారత్ పర్యటనలో ఉన్నారు. జనవరిలో అత్యున్నత పదవిని చేపట్టిన తర్వాత ఇది ఆయన తొలి విదేశీ పర్యటన.. తన పర్యటనలో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. అంతే కాకుండా ప్రధాని మోడీని కలిసి పలు విషయాలపై ప్రధానంగా చర్చించారు.

Exit mobile version