PM Modi: డైరెక్ట్ భూటాన్ To ఎల్ఎన్జేపీ ఆసుపత్రి..! క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని భూటాన్ నుంచి తిరిగి వచ్చారు. దేశ రాజధానిలో అడుగు పెట్టిన వెంటనే పేలుడులో గాయపడిన వారిని పరామర్శించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ఇప్పటికే దాదాపు 100 మంది ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. క్షతగాత్రులకు అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులకు ధైర్యం
చెప్పారు.
Also Read
- RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
- IPL 2026 Prize Money: ఛాంపియన్‌కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
ఇదిలా ఉండగా.. ఢిల్లీ పేలుళ్లపై ప్రధాని మోడీ నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని థింపూలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ప్రసంగించారు. ఉగ్ర కుట్రలను సహించేది లేదని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఢిల్లీ పేలుళ్ల కుట్ర వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదు. రాత్రంతా అధికారులు, నిఘా సంస్థలతో మాట్లాడుతూనే ఉన్నాం. బాధితుల దుఃఖాన్ని అర్థం చేసుకుంటా.. దేశం మొత్తం ఢిల్లీ పేలుళ్ల బాధితులకు అండగా ఉంది’’ అని మోడీ పేర్కొన్నారు.
‘‘ఈ దాడికి సూత్రధారులను వదిలిపెట్టం. ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్ర కుట్రమూలాలను గుర్తించాం. వాళ్లను న్యాయ స్థానం ముందు నిలబెడతాం. పేలుళ్లపై అర్థరాత్రి వరకు సమీక్షలు చేశాను. వివరాలు తెలుసుకున్నాను. పేలుళ్ల వెనుక ఉన్నది ఎవరైనా వదిలిపెట్టబోం. ఢిల్లీ పేలుడు ఘటన కలిచి వేసింది. చాలా బాధాకరమైన హృదయంతో భూటాన్‌కు వచ్చాను’’ అని మోడీ చెప్పారు.
తాజావార్తలు
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్‌కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!