Site icon NTV Telugu

PM Modi: తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల కోసమే.. తొమ్మిదేళ్ల పాలనపై ప్రధాని ట్వీట్

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. దీనిని తొమ్మిదేళ్ల సేవగా పేర్కొన్న ప్రధాని మోదీ.. గత తొమ్మిదేళ్లలో తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించినదేనని అన్నారు. ఈ మేరకు ప్రధాని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. “ఈ రోజు మనం దేశానికి సేవ చేసి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినయం, కృతజ్ఞతతో నిండి ఉన్నాను. తీసుకున్న ప్రతి నిర్ణయం, తీసుకున్న ప్రతి చర్య ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే కోరికతో మార్గనిర్దేశం చేయబడింది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు మేము మరింత కష్టపడి పని చేస్తాము.” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా నెలరోజుల పాటు భారీ ‘ప్రత్యేక సంప్రదింపు ప్రచారాన్ని’ బీజేపీ ప్లాన్ చేసింది. గత తొమ్మిదేళ్లలో దేశం ఫస్ట్ అనే మంత్రంతో దేశం ప్రతి రంగంలోనూ “అపూర్వమైన” అభివృద్ధిని సాధించిందని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రభుత్వం ప్రారంభించిన సర్వతోముఖాభివృద్ధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు “21వ శతాబ్దం భారతదేశానికి చెందినది” అని అభిప్రాయపడ్డారు.

Read Also: BJP: నేటి నుంచి దేశవ్యాప్తంగా బీజేపీ ‘మహాజన్‌ సంపర్క్ అభియాన్‌’

విపక్షాల బహిష్కరణ మధ్య ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. నూతన భవనాన్ని ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణిస్తూ నిర్మాణంలో పాలుపంచుకున్న కొంతమంది కార్మికులను సత్కరించారు. మే 26, 2014న ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ.. మే 30, 2019న రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

 

Exit mobile version