PM Modi: తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల కోసమే.. తొమ్మిదేళ్ల పాలనపై ప్రధాని ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. దీనిని తొమ్మిదేళ్ల సేవగా పేర్కొన్న ప్రధాని మోదీ.. గత తొమ్మిదేళ్లలో తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించినదేనని అన్నారు. ఈ మేరకు ప్రధాని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. “ఈ రోజు మనం దేశానికి సేవ చేసి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినయం, కృతజ్ఞతతో నిండి ఉన్నాను. తీసుకున్న ప్రతి నిర్ణయం, తీసుకున్న ప్రతి చర్య ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే కోరికతో మార్గనిర్దేశం చేయబడింది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు మేము మరింత కష్టపడి పని చేస్తాము.” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా నెలరోజుల పాటు భారీ ‘ప్రత్యేక సంప్రదింపు ప్రచారాన్ని’ బీజేపీ ప్లాన్ చేసింది. గత తొమ్మిదేళ్లలో దేశం ఫస్ట్ అనే మంత్రంతో దేశం ప్రతి రంగంలోనూ “అపూర్వమైన” అభివృద్ధిని సాధించిందని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రభుత్వం ప్రారంభించిన సర్వతోముఖాభివృద్ధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు “21వ శతాబ్దం భారతదేశానికి చెందినది” అని అభిప్రాయపడ్డారు.
Also Read
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
Read Also: BJP: నేటి నుంచి దేశవ్యాప్తంగా బీజేపీ ‘మహాజన్ సంపర్క్ అభియాన్’
విపక్షాల బహిష్కరణ మధ్య ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. నూతన భవనాన్ని ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణిస్తూ నిర్మాణంలో పాలుపంచుకున్న కొంతమంది కార్మికులను సత్కరించారు. మే 26, 2014న ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ.. మే 30, 2019న రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
9 years of unwavering dedication to the nation’s growth.
I invite everyone to visit this site https://t.co/jWxyZLPPcU to get a glimpse of our development journey. It also gives an opportunity to highlight how people have benefited from various Government schemes. #9YearsOfSeva
— Narendra Modi (@narendramodi) May 30, 2023
తాజావార్తలు
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!