Site icon NTV Telugu

PM Modi: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కాసేపట్లో ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష

Pm Modi Review

Pm Modi Review

PM Modi: దేశంలో కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో పరిస్థితి, ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కొవిడ్‌ పరిస్థితిని సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొన్నా ళ్ల వరకు 1000కి లోపే ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం వెయ్యిని దాటి నమోదు అవుతున్నా యి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,026కు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పు న ఐదుగురు మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.09 శాతంగా నమోదు కాగా, వారంవారీ పాజిటివిటీ రేటు 0.98 శాతంగా ఉంది.

Read Also: Manish Sisodia: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 5 వరకు పొడిగింపు

దేశంలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న మరణాల సంఖ్య 5,30,813కి చేరుకుంది. దేశంలో మొత్తంగా గత మూడేళ్ల నుంచి ఇప్ప టి వరకు 4.46 కోట్లు కేసులు నమోదు అవ్వగా.. వీరిలో 4,41,60,279 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.79 శాతం గా ఉంది. ఇప్ప టి వరకు 92.05 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహిం చారు. గత 24 గంటల్లో 1,03,831 టెస్టులు చేశారు. మరణాల రేటు 1.19 శాతం గా ఉంది. దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ కింద 220.65కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లను అందించారు.

Exit mobile version