ప్రధాని మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మధ్యాహ్నం 2.10 గంటలకు బీదర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ప్రధాని మోడీ.. 2.55 గంటలకు బీదర్ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.35 వరకు వివిధ అభివృద్ధి పథకాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. 3.45 నుంచి 4:45 వరకు పబ్లిక్ మీటింల్‌లో మోడీ పాల్గొంటారు. 4.55 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి 5.45 కు బీదర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న మోడీ.. అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారు.
Also Read : Martin Luther King : ఆసక్తికరంగా వున్న సంపూర్ణేశ్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ టీజర్..
అయితే.. నిజామాబాద్ జిల్లాలో రేపటి ప్రధాని మోడీ పర్యటనకు కోసం భారీగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తెలంగాణకు పసుపు బోర్డును మోడీ ప్రకటించడంతో ఇందూర్ ప్రజా ఆశీర్వాద సభను మోడీ కృతజ్ఞత సభగా మార్చారు. మోడీ నిజామాబాద్ టూర్‌కు ముందే బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పసుపు బోర్డు రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ సభలో తెలంగాణకు మరిన్ని ప్రాజెక్టులు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. నిజామాబాద్ వేదికగా 8 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
Also Read : Most Wickets: వరల్డ్ కప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు వీరే..!