NTV Telugu Site icon

PM Modi : కేంద్ర ప్రభుత్వం ఇదే నిజాయితీతో పని చేస్తుంది

Modi

Modi

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం చేరుకున్నారు భారత ప్రధాని మోడీ. ఎరువుల కర్మగారాన్ని, భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని ప్లాంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఎన్టీపీసీ పెర్మనెంట్ టౌన్ షిప్ లో ఏర్పాటుచేసిన వేదిక పైకి ప్రధాని మోడీ చేరుకున్నారు. అయితే.. ప్రధానికి తులసి మొక్క ఇచ్చి స్వాగతం పలికారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలని రాజకీయ కుతంత్రాలుతో స్వార్థ రాజకీయాలతో కొందరు అబాసు పాలు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా.. ‘అలాంటి వాళ్ళని వెతికి వెతికి పట్టుకుంటాం. తెలంగాణలో రోజుకో రంగు మారుతున్న ప్రభుత్వం ఉంది. రెండున్నర సంవత్సరాల కరోనా తో పోరాటం, దేశాల మధ్య యుద్దాలు అందరి మీద ప్రభావం చూపాయి. ఇవన్నీ మనం అధిగమించాము.

Also Read : Minister Botsa Satyanarayana: జగన్ కు రాజకీయాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

భారత దేశం పోరాటం చూసి ప్రపంచ దేశాలన్నీ మన దేశాన్ని అభినదిస్తున్నాయి. ఈ రెండేళ్ల కష్టాలన్నీ తీరి ..రానున్న రెండేళ్లలో 30 సంవత్సరాల అభివృద్ధి జరుగుతుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వేత్తలకు మన మీద నమ్మకం పెరిగింది. ఎనిమిదేళ్ల అభివృద్ధి.. ప్రపంచ దేశాలను ఆలోచించేలా చేస్తున్నాయి. ఆత్మ విశ్వాసం తో భారత్ ప్రపంచం ముందు నిలబడ్డది. 24/7భారత్ లో అభివృద్ధి ప్రారంభం అయ్యింది. ఒక పని శంకుస్థాపన జరిగితే..పూర్తయ్యే వరకు విశ్రమించం.. ఉదాహరణకు RFCL.. 2016 లో శిలాఫలకం.. ఈరోజు జాతికి అంకితం. పెద్ద పెద్ద ఇబ్బందులను ఎదుర్కొని..భారత్ ముందుకెలుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇదే నిజాయితీతో పని చేస్తుంది. పది ఏళ్ళు కింద యూరియా కోసం విదేశాల మీద ఆధార పడ్డాం. ఇప్పుడు యూరియా ఉత్పత్తి చేస్తున్నాం.

Also Read : Yashoda: బాడీ డబుల్ కు సమంత ఒప్పుకోలేదట!

దేశంలో ఎరువుల కంపెనీలన్నీ. సాంకేతిక కారణం తొమూతపడితే.. రైతులకు అందాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్ అయ్యింది. యూరియా కోసం, రైతులు లైన్లు కట్టారు, దెబ్బలు తిన్నారు. జైలుకు వెళ్లారు ఇదంతా గతం.. 2014 తర్వాత యూరియమీదనే దృష్టి పెట్టి బ్లాక్ మార్కెట్ ను ఆపేసినం. యూరియా ఎంత అవసరమో రైతులకు తెలియదు యూరియమీద అవగాహన కల్పించాం. రానున్న రోజుల్లో యూరియ సులభంగా దొరుకుతుంది. ఆర్ ఎఫ్ సి ఎల్ తో దేశంలో ..ఐదు రాష్ట్రాలకు సరిపడా యూరియాను అందిస్తాం. ఎరువుల భారం రైతుల మీద పడనివ్వను’ అని ప్రధాని మోడీ ప్రసంగించారు.