PM Modi: సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు.. 72 గంటల పాటు ‘ఓం’ జపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: సోమనాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో సోమనాథుడికి అభిషేకం చేసి దేశ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపిన ప్రధాని, సోమనాథ్ ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని ఆస్వాదించారు. దీనికి ముందు నిర్వహించిన శౌర్య యాత్రలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ యాత్రలో సోమనాథ్ ఆలయ చరిత్ర, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రతిబింబించే శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ విశిష్టత, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే విధంగా అలంకరించిన శకటాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రధాని పర్యటనతో సోమనాథ్ ఆలయం భక్తుల సందడితో నిండిపోయింది. భద్రతను దృష్టిలో ఉంచుకుని భారీగా ఏర్పాట్లు చేయగా, మోడీ పూజలు దేశవ్యాప్తంగా భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి.
Also Read
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
ఇదిలా ఉండగా.. సోమనాథ్ ఆలయానికి సంబంధించిన వెయ్యేళ్ల విశ్వాసం, భారత చరిత్రలోని కీలక ఘట్టాన్ని స్మరించుకుంటూ ఈ పూజలు నిర్వహించారు. మూడు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా మోడీ నిన్న(శనివారం) రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రధానమంత్రికి కేబినెట్ మంత్రి కున్వర్జీ బావళియా, రాజ్‌కోట్ మేయర్ స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్‌లో సోమనాథ్‌కు వెళ్లారు. ఈ పర్యటనలో సోమనాథ్ ఆలయంలో దర్శనం, పూజలు చేయడంతో పాటు ప్రజా కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో కూడా పాల్గొంటారు. 1026లో మహ్మద్ ఆఫ్ గజ్నీ సోమనాథ్ ఆలయంపై దాడి చేసిన ఘటనకు వెయ్యేళ్లు పూర్తైన సందర్భంగా ఈ స్వాభిమాన్ పర్వ్ నిర్వహిస్తున్నారు. ఇది ఆలయానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యం, జాతీయ గర్వం, అచంచలమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. దేశం నలుమూలల నుంచి వందలాది సాధువులు సోమనాథ్‌కు చేరుకుని 72 గంటల పాటు నిరంతరంగా ‘ఓం’ జపం చేస్తున్నారు. సాయంత్రం డ్రోన్ షో, మంత్రోచ్ఛారణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండనుంది. 2026 సంవత్సరం సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం తర్వాత 75 ఏళ్లకు గుర్తుగా నిలుస్తోంది. 1951లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో ఆలయాన్ని పునర్నిర్మించి, అప్పటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తిరిగి ప్రారంభించారు. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ఇది జాతీయ సంకల్పానికి, సాంస్కృతిక గర్వానికి ప్రతీకగా నిలిచింది. స్వాభిమాన్ పర్వ్‌ను “మన ఆధ్యాత్మిక సంప్రదాయానికి శక్తివంతమైన ప్రతీక”గా మోదీ అభివర్ణించారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!