PM Modi : అరేబియా సముద్రంలో ఉద్రిక్తత, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య, ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. అభివృద్ధితో పాటు, ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం భవిష్యత్తుపై ప్రధాని మోదీ, మహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య చర్చలు జరిగాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య పశ్చిమాసియాలో పరిస్థితిపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. ఉగ్రవాదం, హింస, పౌరుల మరణాలపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, సుస్థిరత కోసం కలిసి పనిచేయాలని ప్రధాని మోడీ, మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా అంగీకరించారు.
Read Also:Ayesha Meera Case: ఆయేషా మీరా కేసులో సీబీఐకి హైకోర్టు నోటీసులు
యువరాజుతో మాట్లాడిన అనంతరం ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా.. మేము పశ్చిమాసియాలోని పరిస్థితులపై అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకున్నాము. ఉగ్రవాదం, హింస, పౌర ప్రాణనష్టం గురించి ఆందోళన వ్యక్తం చేసాము. దీంతో పాటు ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, సుస్థిరత కోసం కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. వరల్డ్ ఎక్స్‌పో 2030, ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2034కి హోస్ట్‌గా ఎంపికైనందుకు సౌదీ అరేబియాను ప్రధాని మోడీ అభినందించారు. గాజాలో రెండున్నర నెలలకు పైగా నెత్తుటి ఘర్షణ జరుగుతోంది. ఇప్పటి వరకు 20 వేల మందికి పైగా మరణించారు. అయినప్పటికీ, గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్‌ను నిర్మూలించే వరకు గాజాలో కాల్పుల విరమణ ఉండదని ఇజ్రాయెల్ పేర్కొంది.
Read Also:Salman Khan: సల్మాన్ ఖాన్ లో ఈ టాలెంట్ కూడా ఉందా? ఫ్యాన్స్ ఫిదా..