NTV Telugu Site icon

PM Modi: యుపి ర్యాలీలో “ఫ్లాప్ ఫిల్మ్” అంటూ వారి పై వ్యాఖ్యలు చేసిన పీఎం మోడీ..!

6

6

లోక్‌సభ ఎన్నికల కోసం ఇరు పార్టీల మధ్య పొత్తుపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ లపై ప్రధాని నరేంద్ర మోదీ కాస్త ఘాటుగానే స్పందించారు. యుపి ర్యాలీలో శనివారం నాడు ఆయన మాట్లుడుతూ.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో విఫలమైన భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు. “దో లడ్కోన్ కి ఫ్లాప్ ఫిల్మ్” మళ్లీ విడుదలైంది అంటూ .. రాహుల్ గాంధీ, అధినేత అఖిలేష్ యాదవ్‌ లపై కాస్త గట్టిగానే విరుచుక పడ్డారు. ఇక్కడ జరిగిన ర్యాలీలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ., వారు “కమీషన్” కోసం ఉండగా., తన ప్రభుత్వం ఒక మిషన్‌లో ఉందని పేర్కొన్నారు.

Also Read: The Family Star: ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్స్‌కి రప్పిస్తున్న పరశురామ్!

ఇక ఈ సభలో ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ కు కంచుకోటల నుంచి కూడా అభ్యర్థులు దొరకడం కష్టమవుతోందని, పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయని సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పొత్తు పెట్టుకున్న దాదాపు ఏడేళ్ల తర్వాత., ఈ ఏడాది ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ఆగ్రాలో రోడ్‌ షో నిర్వహించారు, అందులో వారు విజయం సాదించలేకపోయారని.. 2017 ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీల మద్దతుదారులు తమ నాయకులను “యుపి కే లడ్కే” గా అభివర్ణించినట్లు తెలిపారు.

Also Read: Pakistan Cricket Team: పాకిస్థాన్ ఆటగాళ్లకు స్నైపర్ ట్రైనింగ్.. వీడియో వైరల్

బీజేపీ తన చర్యల ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుందని ప్రధాని మోదీ అంటూ.. ‘ఈరోజు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం. కేవలం కొన్ని దశాబ్దాల్లోనే రికార్డు స్థాయిలో మన దేశప్రజలు బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంది, బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంది. దీనికి అతిపెద్ద కారణం. బీజేపీ రాజకీయాలను అనుసరించడం లేదు కానీ జాతీయ విధానాన్ని అనుసరిస్తుంది. బీజేపీకి దేశం ముందుంటుంది, ఇది బీజేపీ నినాదం కాదు, మా విశ్వాసం అని ఆయన అన్నారు.