NTV Telugu Site icon

PM Modi: చివరి సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలి.. లేకపోతే ప్రజలు క్షమించరు..

Modi

Modi

బడ్జెట్ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. నారీశక్తిని కేంద్రం ప్రతిబింబిస్తుందన్నారు. జనవరి 26న కర్తవ్యపథ్‌లో నారీశక్తి ఇనుమడించిందని ఆయన పేర్కొన్నారు. పదేళ్లలో మేం చేసిన అభివృద్ధి పనులు ఏంటో ప్రజలకు తెలుసు.. దేశహితాన్ని దృష్టిలో పెట్టుకుని సభ సజావుగా జరిగేలా విపక్షాలు సహకరించాలి.. ఎందుకంటే, ఇవే చివరి సమావేశాలు సజావుగా జరిగేలా సభ్యులు సహకరించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. సమావేశాలను అడ్డుకునే వారిని ప్రజలు క్షమించరని పరోక్షంగా ప్రతిపక్షాలను హెచ్చరికలు జారీ చేశారు.

Read Also: Allu Sneha Reddy: స్నేహా రెడ్డి ఒంటరిగా తిరుమలకు వెళ్లడానికి కారణం ఏంటో తెలుసా?

ఇక, లోక్ సభ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెడతామని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కే అలవాటున్న ఎంపీలు ఏం చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కాగా, పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుత 17వ లోక్‌సభకు ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. రాష్ట్రపతి ప్రసంగం, ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమర్పణ, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రధాని నరేంద్ర మోడీ సమాధానంతో ఈ సమావేశాలు ముగుస్తాయి.