PM Modi Bhutan Visit: ప్రధాని నరేంద్రమోడీకి భూటాన్ అత్యున్నత పురస్కారం.. “ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో” ప్రధానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Bhutan Visit: ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పాటు భారత సరిహద్దు దేశం భూటాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇదిలా ఉంటే భూటాన్ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని నరేంద్రమోడీకి అందించింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’’ అవార్డును భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్‌చుక్ స్వయంగా ప్రధాని మోడీకి ప్రధానం చేశారు.
భూటాన్ అత్యున్నత గౌరవాన్ని పొందిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ రోజు నా జీవితంలో చాలా పెద్ద రోజు, నాకు భూటాన్ అత్యున్న పౌర గౌరవం లభించింది. ప్రతీ అవార్డు ప్రత్యేకమైంది, కానీ మీరు అవార్డు వేరే దేశం నుంచి అందుకున్నప్పుడు , రెండు దేశాలు కూడా సరైన మార్గంలో వెళ్తున్నాయని చూపిస్తుంది. ప్రతీ భారతీయుడి తరుపున ఈ అవార్డును నేను తీసుకుంటున్నాను’’ అని అన్నారు.
Also Read
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
Read Also: Indra Nooyi: అమెరికాలో భారతీయ విద్యార్థులకు కీలక సూచనలు
భూటాన్ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ నేతగా ప్రధాని నరేంద్రమోడీ చరిత్ర సృష్టించారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న మోడీకి ఇది మూడో అత్యున్నత విదేశీ పురస్కారం. అంతకుముందు ఈ అవార్డును కేవలం నలుగురికి మాత్రమే భూటాన్ ఇచ్చింది. 2008లో రాయల్ క్వీన్ అమ్మమ్మ ఆషి కేసాంగ్ చోడెన్ వాంగ్‌చుక్‌కి, 2008లో హిస్ హోలీనెస్ జె త్రిజుర్ టెన్జిన్ డెండప్ (భూటాన్‌కు చెందిన 68వ జే ఖెన్పో)కి, 2018లో హిస్ హోలీనెస్ జె ఖెన్పో ట్రుల్కు న్గావాంగ్ జిగ్మే చోడ్రా ఈ అవార్డు అందించారు. భూటాన్ కేంద్ర సన్యాసి సంస్థకు ప్రధాన మఠాధిపతి జే ఖెన్పో.
అంతకు ముందు ఈ రోజు భూటాన్ పారో విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి ఆ దేశ ప్రధాని షేరింగ్ టోబ్గే ఘన స్వాగతం పలికారు. పారో నుంచి రాజధాని థింపు వరకు 45 కిలోమీటర్ల పొడవున ప్రజలు బారులుతీరి మోడీకి స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య పెట్రోలియం ఉత్పత్తులు, ఆహారం, ఇంధన సహకారం, క్రీడలు మరియు యువత, ఔషధ ఉత్పత్తులలో సహకారం, అంతరిక్ష సహకారం వంటి ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి.
#WATCH | Thimpu: The King of Bhutan confers the Order of the Druk Gyalpo on Prime Minister Narendra Modi.
As per ranking and precedence established, the Order of the Druk Gyalpo was instituted as the decoration for lifetime achievement and is the pinnacle of the honour system in… pic.twitter.com/hkszvDdWyd
— ANI (@ANI) March 22, 2024
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!