PM Modi: కన్యాకుమారిలో ప్రధాని పర్యటన.. భగవతి అమ్మన్‌లో పూజలు

Mdoe

Mdoe

దేశ వ్యాప్తంగా గురువారం ఏడో విడత ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. దీంతో నేతలంతా రిలాక్స్ అవుతున్నారు. ప్రధాని మోడీ.. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచి దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. ఇక నోటిఫికేషన్ వెలువడ్డాక కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దాదాపు 200కి పైగా పబ్లిక్ మీటింగ్స్, 80 ఇంటర్వ్యూల్లో మోడీ పాల్గొన్నారు. ఇక ప్రచారాలు ముగియడంతో ధ్యానం కోసం తమిళనాడులోని కన్యాకుమారికి ప్రధాని చేరుకున్నారు.

ఇది కూడా చదవండి: Priyanka Dutt : బుజ్జి ఈవెంట్లో హాట్ టాపిక్ గా మారిన ప్రియాంక వ్యవహార శైలి

కన్యాకుమారిలోని భగవతి అమ్మన్ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు స్వామి వివేకానంద ధ్యానం మండపంలో ధ్యానం చేయనున్నారు.

ఎన్నికల ప్రచారం ముగిశాక ప్రధాని ఆధ్యాత్మిక యాత్రలకు శ్రీకారం చుట్టడం తెలిసిందే. దీనికి అనుగుణంగానే ఆయన మే 30న కన్యాకుమారి చేరుకుని జూన్ 1 వరకు ఉండనున్నారు. 2019లో కూడా ఎన్నికల ప్రచారం ముగియగానే కేదార్‌నాథ్‌ను సందర్శించారు. 2014లో శివాజీ ప్రతాప్‌గఢ్‌ను సందర్శించారు.

ఇది కూడా చదవండి:Weapon Trailer Launch: ‘అది ఆట కాదు.. యుద్ధం..’ సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న ‘వెపన్’..

543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈసారి 370 సీట్లకు పైగా స్థానాలు కైవసం చేసుకుంటామని ప్రధాని మోడీ తెలిపారు. ఇక ఎన్డీఏ కూటమి అయితే 400 సీట్లకు పైగా స్థానాలు సొంతం చేసుకుంటుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.