PM Manipur Visit: 2023లో మణిపూర్ రాష్ట్రంలో మెయిటీ – కుకి వర్గాల మధ్య జాతి హింస చెలరేగిన తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సెప్టెంబర్ రెండవ వారంలో ఉండవచ్చని సమాచారం. ఈసందర్భంగా ప్రధాని తన పర్యటనలో ఇంఫాల్, చురాచంద్‌పూర్ జిల్లాలను సందర్శించి, అక్కడ హింస కారణంగా నిరాశ్రయులైన ప్రజలను కలువనున్నారు. ప్రధాని తన పర్యటన సందర్భంగా అనేక కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటించడంతో పాటు, కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఉండేలా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు, గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
READ ALSO: Mahavatar Narsimha : ఆస్తులన్నీ అమ్ముకున్నా.. మహావతార్ డైరెక్టర్ కష్టాలు
హింసలో 250 మందికి పైగా చనిపోయారు..
మే 2023లో మెయిటీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలనే డిమాండ్‌కు నిరసనగా హింస ప్రారంభమైంది. కుకి కమ్యూనిటీ ప్రదర్శన తర్వాత మణిపూర్‌లో హింస చెలరేగింది. పరిస్థితిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను మోహరించింది. హింస కారణంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో పాటు సుమారుగా 60 వేల మందికి పైగా ప్రజలు సహాయ శిబిరాల్లో నివసిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అనంతరం ఆగస్టులో దీనిని మరో ఆరు నెలలు పొడిగించారు. రాష్ట్రపతి పాలన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి కొంతవరకు సాధారణ స్థితికి చేరుకుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా మణిపూర్‌ను సందర్శించారు.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ పార్టీలో నాయకత్వంపై ఏకాభిప్రాయం లేకపోవడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 21 నెలల అనంతరం ఫిబ్రవరి 13, 2025న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ చర్య ప్రజాస్వామ్య సూత్రాల ఉల్లంఘన అని, రాష్ట్రపతి పాలన నిర్ణయం ఆలస్యంగా తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మణిపూర్‌లో హింస తగ్గిందని, శాంతి కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
READ ALSO: Home Cleaning Tips: ఇంట్లో వీటిని క్లీన్ చేస్తున్నారా?.. ఎందుకైనా మంచిది ఓ లుక్ వేయండి