NTV Telugu Site icon

Jairam Ramesh: మోడీ ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు..

Jairam Ramesh

Jairam Ramesh

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నాజీ రాజకీయ వేత్త అయిన జోసెఫ్ గోబెల్స్‌ను మోడీ స్ఫూర్తిగా తీసుకున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ (సోమవారం) ఆయన ట్విట్టర్ (ఎక్స్‌)లో పోస్ట్ చేశారు. మీకు ఒక అబద్దాన్ని చెప్పి దానిని పదే పదే పునరావృతం చేయడం ద్వారా చివరికి ప్రజలు దానినే నమ్ముతారని గోబెల్స్ వ్యాఖ్యానించేవారని ఆయన చెప్పారు. కాబట్టి, రాజకీయ శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన మోడీ ఖచ్చితంగా గోబెల్స్ ప్రచార విలువను చదివి ఆయన నుంచి స్ఫూర్తి పొందే ఉంటాడని విమర్శించారు. అందుకే దేశం మొత్తం తిరిగి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జైరాం రామేశ్ చెప్పుకొచ్చారు.

Read Also: Twitter Down: నిలిచిపోయిన ట్విట్టర్.. ఐదు రోజుల్లో ఇది రెండో సారి

కాగా, ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే మోడీ ఓ మాజీ ప్రధానిపై, కాంగ్రెస్ న్యాయ పత్రమై సిగ్గులేకుండా అబద్ధాలు చెప్పారని జైరాం రమేశ్ వెల్లడించారు. అసత్యమేవ జయతే అనేది ఎల్లప్పుడూ ప్రధాని మోడీ నినాదం అని ఆరోపలు చేశారు. ఆయన మాట్లాడుతున్న మాటలే దీన్ని పదేపదే రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు. మోడీ మాట్లాడిన ప్రతిసారీ సత్యం కనుమరుగైపోతుందని వెల్లడించారు. కానీ, నరేంద్ర మోడీ ఎన్ని అబద్దాలు చెప్పినా దేశ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమికి స్పష్టమైన ఆధిక్యం రావడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ధీమా వ్యక్తం చేశారు.