NTV Telugu Site icon

Modi-Pawan Kalyan: మోడీతో మెగా బ్రదర్స్‌.. చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం!

Pm Modi Chiranjeevi

Pm Modi Chiranjeevi

PM Modi Talks With Pawan Kalyan and Chiranjeevi: ఏపీ మంత్రిగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ జనసేనితో ప్రమాణం చేయించారు. పవన్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వేదిక మొత్తం దద్దరిల్లిపోయింది. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్‌తో పాటు సీఎం చంద్రబాబు నాయుడుకు పవన్‌ ధన్యవాదాలు తెలిపారు.

ప్రమాణ స్వీకారం అనంతరం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరించిన పవన్ కల్యాణ్‌.. తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి కళ్ల మీద పడి మరోసారి ఆశీర్వాదం తీసుకున్నారు. పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు, పీఎం నరేంద్ర మోడీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్స్‌ ఇద్దరినీ ప్రధాని హత్తుకున్నారు. చిరంజీవి, పవన్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. మెగా బ్రదర్స్‌ చేతులు పట్టుకొని ప్రధాని ప్రజలకు అభివాదం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.