PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. “దేశం కోసం.. భవిష్యత్తు కోసం.. మనందరి బాధ్యత” అనే నినాదంతో ప్రజలందరూ తమ దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆయన కోరారు. కరోనా సంక్షోభం, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. ప్రధాని సూచించిన కీలక సూచనలు ఇవే..
ఏడాది పాటు బంగారం కొనవద్దు:
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో, కనీసం ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని సూచించారు. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి:
ముడి చమురు దిగుమతులపై భారాన్ని తగ్గించేందుకు, పర్యావరణ రక్షణ కోసం వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ఇంధనాన్ని ఆదా చేయాలని కోరారు.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి:
కాలుష్య రహిత భారతం కోసం సాంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వాడకాన్ని పెంచాలని, పర్యావరణ హితమైన రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్స్:
ప్రయాణ ఖర్చులు, సమయాన్ని ఆదా చేసేందుకు.. వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని అనుసరించాలని, సమావేశాలను ఆన్లైన్ వేదికల ద్వారా నిర్వహించుకోవాలని తెలిపారు.
విదేశీ పర్యటనలు తగ్గించాలి:
దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, విదేశాలకు తరలిపోయే ధనాన్ని అరికట్టడానికి విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని సూచించారు.
వంట నూనెల వినియోగం:
ఆరోగ్యపరంగా, దిగుమతి భారం తగ్గించే ఉద్దేశంతో వంట నూనెల వినియోగంలో పొదుపు పాటించాలని కోరారు.
రసాయనిక ఎరువుల వాడకం:
నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడటానికి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రసాయనిక ఎరువుల వాడకాన్ని క్రమంగా తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు.
సోలార్ పంపులు:
వ్యవసాయ రంగంలో విద్యుత్ ఆదా కోసం సోలార్ పంపు సెట్లను వినియోగించాలని, తద్వారా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు అడుగులు వేయాలని సూచించారు.
స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత:
స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా దేశీయ పరిశ్రమలను, చేతివృత్తుల వారిని ఆదుకోవాలని.. ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని పాటించాలని కోరారు.
ఆడంబరాలు తగ్గించాలి:
మధ్య తరగతి కుటుంబాలు అనవసరపు ఖర్చులను, ఆడంబరాలను తగ్గించుకుని పొదుపు వైపు మొగ్గు చూపడం ద్వారా ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!