NTV Telugu Site icon

Union Cabinet: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల వేళ.. కేంద్ర కేబినెట్ కీలక భేటీ

Cabinet

Cabinet

Union Cabinet: ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ కీలక కేంద్ర కేబినెట్‌ సమావేశం జరుగుతోంది. సమావేశం ఎజెండా ఇంకా వెల్లడి కానప్పటికీ, ప్రత్యేక సమావేశంలో పరిశీలన కోసం జాబితా చేయబడిన కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోడీ నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ సమావేశానికి ముందు కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశాలు నిర్వహించారు. అమిత్‌ షాతో భేటీ అనంతరం ఇద్దరు కేంద్ర మంత్రులతో సమావేశం జరిపారు. కేంద్ర మంత్రుల భేటీ అజెండాపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎలాంటి ముందస్తు నోట్‌ లేకుండానే కేంద్ర మంత్రులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. కేంద్ర కేబినెట్‌ ప్రస్తుతం కొనసాగుతుండగా.. ఎజెండాపై సస్పెన్స్ కొనసాగుతోంది. కీలక నిర్ణయాల దిశగా కేంద్ర ప్రభుత్వం సాగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో పాటు ఓబీసీ బిల్లును ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: DMK MP TR Baalu: మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు డీఎంకే ఎంపీ హెచ్చరిక.. ఏమన్నారంటే?

ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల్లో ఎనిమిది బిల్లులపై చర్చ జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. న్యాయవాదుల (సవరణ) బిల్లు 2023, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు 2023, పోస్టాఫీసు బిల్లు 2023, ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) బిల్లు 2023, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి సంబంధించిన బిల్లు, SC/ST ఆర్డర్‌కు సంబంధించిన మూడు బిల్లులపై చర్చ జరగనుంది. దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చని అంచనా వేయబడింది. ఈ

పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో ‘వన్‌ నేషన్-వన్‌ ఎలక్షన్‌’ బిల్లు, ఇండియాకు భారత్‌గా పేరు మార్చే సంభావ్య తీర్మానం అనే రెండు అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈరోజు ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబరు 22 వరకు కొనసాగనున్నాయి.మంగళవారం పార్లమెంట్ కార్యకలాపాలు కొత్త భవనానికి మార్చబడతాయి.