ప్రపంచ వ్యాప్తంగా దీపావళి సందడి కనిపిస్తోంది. అయితే.. దీపావళి రోజున మనమంతా కుటుంబసభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటే, దేశ రక్షణ కోసం ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో మోహరించి తమ కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో.. దేశ ప్రధాని మోడీ సైనికులను ప్రోత్సహించారు. గుజరాత్‌లోని కచ్‌లో బీఎస్‌ఎఫ్ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. మోడీ వారితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన చేతులతో సైనికులకు మిఠాయిలు తినిపించారు. గుజరాత్ కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలోని లక్కీ నాలా వద్ద బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కలిసి ప్రధాన మంత్రి దీపావళి వేడుకలను జరుపుకున్నారు.
Read Also: IPL Retention 2025: విరాట్ కోహ్లీకి 21 కోట్లు.. ముగ్గురినే రిటైన్ చేసుకున్న బెంగళూరు!
దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకునే అవకాశం లభించడం అత్యంత సంతోషకరమని సైనికులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. అంగుళం భూమి విషయంలో కూడా రాజీపడని ప్రభుత్వం మన దేశంలో ఉందన్నారు. 21వ శతాబ్దపు అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ఈ రోజు మనం మన సైన్యాలను, మన భద్రతా బలగాలను ఆధునిక వనరులతో సన్నద్ధం చేయడం ద్వారా ఆధునిక సైనిక శక్తిని సృష్టిస్తున్నామని మోడీ పేర్కొన్నారు. తాము తమ సైన్యాన్ని ప్రపంచంలోని అతిపెద్ద సైన్యాల ర్యాంక్‌లో ఉంచుతామని.. తమ ప్రయత్నాలకు ఆధారం రక్షణ రంగంలో స్వావలంబన అని ప్రధాని మోడీ తెలిపారు.
Read Also: SRH Retentions List: తగ్గేదేలే.. దమ్మున్న ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఎస్ఆర్హెచ్
ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన్నప్పటి నుండి ప్రతిసారీ ఆర్మీ సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. ఆ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఇప్పుడు భారత్‌కు ఏమీ జరగదని ఉగ్రవాదుల మాస్టర్ ప్లాన్లను గ్రహించామని, భారత్ ఇప్పుడు ఏ ఉగ్రవాదిని విడిచిపెట్టదని అన్నారు. కాగా.. 2022లో ప్రధాని మోడీ కార్గిల్‌లో సైనికులతో దీపావళి జరుపుకోగా, 2023లో హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాలో భారతీయ సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు.