Site icon NTV Telugu

PM Modi Birthday: హ్యాపీ బర్త్ డే మోడీజీ

Modi

Modi

ప్రధాని నరేంద్ర మోడీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అలాగే ప్రధాని మోడీ కూడా తన బర్త్ డే రోజున న్యూఢిల్లీలోని ద్వారకలో యశోభూమిగా పిలిచే ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తొలి దశను నేడు ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని బీజేపీ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వరకు దేశవ్యాప్తంగా సేవా పఖ్వాడా పేరుతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

Read Also: Fraud: మాయమాటలతో భక్తులకు అర్చకుడు శఠగోపం.. క్షుద్ర పూజల పేరుతో 48 తులాలు స్వాహా

సేవా పఖ్వాడా కింద నేటి నుంచి ఈ నెల 24 వరకు ‘ఆయుష్మాన్ భవ వారోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో అన్ని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆయుష్మాన్ యోజన కింద పేదలకు ఈ-కార్డులు పంపిణీ చేయనున్నారు. అదే టైంలో సఅక్టోబరు 2 వరకు బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక స్వచ్ఛతా ప్రచార కార్యక్రమం నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని మోడీ ప్రారంభించనున్నారు. రాంచీలోని మొరాబాదిలోని ఆర్యభట్ట ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోడీ విశ్వకర్మ యోజనను ప్రారంభిస్తారు.

Read Also: Mexico: మెక్సికోలోని ఓ బార్ లో కాల్పులు.. ఆరుగురి మృతి

ప్రధాని మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఉదయం 10 గంటలకు ప్రసిద్ధ ఇండియా గేట్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. అలాగే ఢిల్లీలోని దర్గా హజ్రత్ నిజాముద్దీన్‌లో ఆయన దీర్ఘాయువు, మెరుగైన ఆరోగ్యం కోసం సామూహిక ప్రార్థనలు చేయనున్నారు. ఇక, ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో దేశంలోని మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ ఔట్ పేషెంట్ విభాగం ప్రారంభించనున్నారు. లింగమార్పిడి సంఘంతో సమన్వయం చేయడానికి ఢిల్లీకి చెందిన సేవా భారతి కోఆర్డినేటర్లు కార్యక్రమంలో పాల్గొంటారు.

Exit mobile version