PM Kisan: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ రోజే డబ్బులు ఖాతాల్లోకి జమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి 24వ విడత డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయనే దానిపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీపావళి పండుగకు ముందే, అంటే అక్టోబర్ 30వ తేదీన 24వ విడత డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలో జూన్ నెలలో 23వ విడత డబ్బులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 30వ తేదీన రైతుల ఖాతాల్లో రూ. 2,000 చొప్పున జమ కానున్నాయి.
ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ఏడాదికి మొత్తం రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రతి నాలుగు నెలలకోసారి రూ. 2,000 చొప్పున మూడు విడతల్లో ఈ డబ్బులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానం ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి పంపుతారు. ఈ సాయం వల్ల విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఖర్చుల కోసం రైతులు ఇబ్బంది పడకుండా లబ్ధి పొందుతున్నారు.
Also Read
Direct Support, Stronger Farmers!
Mark your calendar! The 24th instalment of PM-KISAN is set to be released on 30th October 2026, empowering our Annadatas with continued financial support.
#PMKISAN #PMKISAN24thInstalment #pmkisan #agrigoi https://t.co/rMOXj7R9NP
— PM Kisan Samman Nidhi (@pmkisanofficial) October 23, 2026
అయితే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలను పాటించడం తప్పనిసరి. రైతులు తమ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి. బయోమెట్రిక్ లేదా ఓటీపీ ఆధారంగా ఈ-కేవైసీ పూర్తి చేయని వారికి ఈ విడత డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండటంతో పాటు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సదుపాయం యాక్టివ్ లో ఉండాలి. వీటితో పాటు భూములకు సంబంధించిన వివరాలు పోర్టల్ లో సరిగ్గా అప్లోడ్ చేసి ఉండాలి. ఈ ప్రక్రియలన్నీ సరిగ్గా ఉన్న రైతులకు మాత్రమే అక్టోబర్ 30న రూ. 2,000 సాయం అందుతుంది.
తాజావార్తలు
-
PM Kisan: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ రోజే డబ్బులు ఖాతాల్లోకి జమ..
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!