Viral: పచ్చదనం వెల్లివిరిసేలా పెళ్లి పిలుపు.. పెళ్లి పత్రికలో చెట్ల విత్తనాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఓ మధురమైన ఘట్టం. జీవితంలో ఒక్కసారి చేసుకునే ఈ కార్యక్రమంకు వారి స్థాయికి తగ్గట్టు వివాహ సంబరాలను ఏర్పాటు చేసుకుంటారు. మరికొందరైతే వారి స్థాయికి మించి కూడా చేయడం మనం చూస్తుంటాము. ఇందులో భాగంగానే వివాహ ఆహ్వాన పత్రిక నుండి పెళ్లికి వచ్చిన బంధుమిత్రులకి కల్పించే సౌకర్యాల నుండి వారు తిరిగి వెళ్లే సమయంలో ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ వరకు అన్ని మంచ్చిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక వివాహ ఆహ్వాన పత్రికలను కొందరు వ్యక్తులు వారి ప్రత్యేక అభిరుచితో తయారు చేయించడం మనం గమనిస్తుంటాము. తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ కు చెందిన ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ కోరకొప్పుల స్వర్ణలత తన కుమార్తె వైష్ణవి వివాహంలో భాగంగా బంధుమిత్రులకు పంచేందుకు ఏకంగా కోయంబత్తూర్ కు వెళ్లి 1,250 పత్రికలు, 500 పెన్నులను ఆర్డర్ ఇచ్చారు. అయితే వీటి ప్రత్యేకత ఏమైని అనుకుంటున్నారా..? ఈ పత్రికలో తులసి, బంతి, చామంతి విత్తనాలు ఉండడమే ఇందులో ప్రత్యేకత. అదేవిధంగా పెన్నులో వంకాయ, టమాటా, కొత్తిమీర, పాలకూర, ముల్లంగి లాంటి కూరగాయల విత్తనాలు ఉంటాయి.
Read Also: Visakhapatnam: విశాఖలో చిరుత పులి చర్మం రవాణా.. పోలీసుల అదుపులో నిందితులు..
Also Read
ఇలా తయారు చేసిన పత్రికను కేవలం రెండు గంటల పాటు నీటిలో నానబెట్టిన తరువాత దానిని మట్టిలో పాతిపెడితే చాలు వాతంటకు అవే మొలకలొస్తాయి. స్వర్ణలత తన కుమార్తె పెళ్లిపత్రిక ద్వారా కోనైనా కొత్త మొక్కలకు ప్రాణం పోయాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేయించానని ఆమె చెబుతున్నారు. మీరు మీ ఇంటి కార్యక్రమాలలో ఇలాంటి ఆలోచనతో మరికొన్ని మొక్కలకు ప్రాణం పోయండి.
తాజావార్తలు
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
-
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
-
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!