Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Planetary Alignment: ఖగోళ ప్రియులకు పండగ లాంటి వార్త. అంతరిక్షంలో నేడు అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలోని ప్రధాన గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వచ్చి దర్శనమివ్వబోతున్నాయి. ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహాలన్నీ ఒకే సరళ రేఖలో ఉండవు. కానీ భూమి నుండి చూసినప్పుడు అవి ఆకాశంలో ఒకే వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి. దీనినే ‘ప్లానెటరీ అలైన్మెంట్’ (Planetary Alignment) అని పిలుస్తారు. ఈ అరుదైన ఘట్టంలో మొత్తం ఆరు గ్రహాలు బుధుడు, శుక్రుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ పాలుపంచుకుంటున్నాయి.
Roslin: దృశ్యం డైరెక్టర్ నుండి మరో థ్రిల్లర్.. ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న మీనా ‘రోజలిన్’!
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
భారత కాలమానం ప్రకారం ఈ అద్భుత దృశ్యం ఈరోజు సాయంత్రం 6:15 నుండి రాత్రి 8:00 గంటల మధ్య అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యాస్తమయం అయిన సుమారు 30 నుండి 45 నిమిషాల తర్వాత ఆకాశం వైపు చూస్తే ఈ గ్రహాల వరుసను గమనించవచ్చు. ఆకాశంలో పడమర దిశ నుండి మొదలై ఆగ్నేయం వరకు ఒక ‘విల్లు’ ఆకారంలో ఈ గ్రహాలు విస్తరించి ఉంటాయి.
ఈ వరుసలో బృహస్పతి, శుక్రుడు అత్యంత ప్రకాశవంతంగా ఉంటాయి. కాబట్టి వీటిని నేరుగా చూడొచ్చు. ఆకాశం స్వచ్ఛంగా ఉంటే శని, బుధుడు కూడా కంటికి కనిపిస్తాయి. ఇక యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు భూమికి చాలా దూరంలో ఉండటం వల్ల మసకగా కనపడుతాయి. వీటిని వీక్షించడానికి కచ్చితంగా బైనాక్లర్స్ లేదా టెలిస్కోప్ అవసరం. సూర్యుడు పూర్తిగా అస్తమించిన తర్వాతే టెలిస్కోప్ లేదా బైనాక్లర్స్ వాడటం సురక్షితం.
తాజావార్తలు
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!