Site icon NTV Telugu

Plane Crash: కుప్పకూలిన మెడికల్‌ ట్రాన్స్‌పోర్ట్ విమానం.. రోగితో పాటు ఐదుగురు మృతి

Plane Crash

Plane Crash

Plane Crash: అమెరికాలో పశ్చిమ రాష్ట్రమైన నెవాడాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మెడికల్‌ ట్రాన్స్‌పోర్ట్ విమానం కుప్పకూలడంతో అందులో రోగితో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నెవాడా సరిహద్దులో శుక్రవారం రాత్రి విమానం రాడార్‌ నుంచి బయటపడిందని ఓ ప్రకటన ద్వారా తెలిసింది. విమానంలో ఉన్న ఐదుగురిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని సెంట్రల్‌ లియోన్‌ కౌంటీ అగ్నిమాపకశాఖ ప్రకటించింది.

Read Also: Pakistan: పాక్ సైన్యానికి రెండు పూటల ముద్ద కరువు.. ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతే కారణం

పైలట్‌తో పాటు విమానంలో ఒక నర్సు, ఒక పారామెడిక్, ఒక రోగి, ఒక రోగి కుటుంబ సభ్యుడు ఉన్నారని ఆర్‌ఈఎంసీఏ హెల్త్ పేర్కొంది. ఘటన జరిగిన స్థలంలో శీతాకాలపు మంచు తుఫాను వల్ల మంచు ఎక్కువగా ఉంది. ఘటనాస్థలిలో గల పరిస్థితులు ఇంకా ధృవీకరించబడలేదు. అమెరికా పశ్చిమ తీరాన్ని మంచు తుఫాను దెబ్బతీస్తోంది. దక్షిణ కాలిఫోర్నియాలో సాధారణంగా వెచ్చని ప్రాంతాలను కూడా మంచు కప్పేసింది. కాలిఫోర్నియాలో దాదాపు లక్ష మంది విద్యుత్‌ వినియోగదారులు చీకట్లోనే బతుకుతున్నారు. మెక్సికో, కాలిఫోర్నియా, పసిఫిక్ నార్త్‌వెస్ట్, కెనడాలను కలిపే ప్రధాన ఉత్తర-దక్షిణ రహదారి అయిన ఇంటర్‌స్టేట్ 5 విభాగాల్లో మంచు విపరీతంగా కురవడంతో ప్రధాన రహదారులు మూసివేయబడ్డాయి.

Exit mobile version