ప్రో కబడ్డీ సీజన్ 11 ఈరోజు ప్రారంభమైంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రో కబడ్డీ పోటీలు మొదలయ్యాయి. అయితే.. తొలి మ్యాచ్ బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ మధ్య పోరు జరిగింది. ఈ పోరులో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. 37-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో.. మొదటి మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. గత సీజన్ లో పేలవ ప్రదర్శన చూపించిన తెలుగు టైటాన్స్.. ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్లో విజయంతో షురూ చేసింది.
Read Also: Amaravati Drone Summit 2024: అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 కోసం విస్తృత ఏర్పాట్లు
తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ 13 పాయింట్లతో చెలరేగాడు. దీంతో.. ప్రో కబడ్డీ లీగ్ లో పవన్ రికార్డు సాధించాడు. పవన్ కి తోడు రైట్ కార్నర్ డిఫెండర్ క్రిషన్ ఆరు పాయింట్లు సాధించాడు. బెంగళూరు బుల్స్‌లో స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ దారుణంగా విఫలమయ్యాడు. మూడే పాయింట్స్ సాధించాడు. సురిందర్ దెహాల్ 5 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన టైటాన్స్.. ఫస్టాఫ్ ఫస్టాఫ్ ముగిసే సమయానికి 20-11తో భారీ ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్ లో బెంగళూరు బుల్స్ రాణించినప్పటికీ.. టైటాన్స్ ఆధిక్యంలో ఉన్నందున విజయం వరించింది. కాగా.. రేపు రాత్రి 8 గంటలకు తమిళ్ తలైవాస్‌తో టైటాన్స్ రెండో మ్యాచ్ ఆడనుంది.
Read Also: Kash Patel: ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయితే.. సీఐఏ చీఫ్‌గా భారత మూలాలున్న కాష్ పటేల్..