NTV Telugu Site icon

Pilli Satyanarayana Murthy : కార్యకర్తల ఆలోచన విధానమే మా ఆలోచన విధానం

Pilli Satyanarayana

Pilli Satyanarayana

ఏపీలో రాజకీయం వేడెక్కింది. నిన్న టీడీపీ-జనసేన పార్టీలు అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతల్లో అసంతృప్తి సెగలు రగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ జనసేనకు కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి వర్గం స్పందించారు.. 25 ఏళ్లుగా గతంలో సంపర, ప్రస్తుతం కాకినాడ రూరల్ టీడీపీ బీసీలకు కేటాయిస్తుందని పార్టీ నిర్ణయంతో శెట్టిబలిజలు మనస్తాపం చెందారని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్యనారాయణ. కార్యకర్తల ఆలోచన విధానమే మా ఆలోచన విధానం అని రెండు మూడు రోజుల్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్తున్నారు..

Multibagger Stock : రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.3లక్షలు.. 3000శాతం రాబడి ఇచ్చిన షేర్ ఏదో తెలుసా ?

కార్యకర్తలు చెప్పిన కార్యక్రమం నేను పాటించాల్సి ఉంటుందని తన అనుచరులు సహనం పాటించాలని కోరుతున్నానన్నారు.. పిల్లి వ్యాఖ్యలపై ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన-టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. అధిక స్థానాల్లో పోటీ చేస్తామని భావించిన జనసైనికులు.. తొలిజాబితాను చూసి ఆశ్చర్యపోయారు. ఇదే సమయంలో.. తాము ఇన్ని రోజులు క్యాడర్‌ కాపాడుకుంటూ వస్తున్న టీడీపీ నేతలు సైతం టికెట్‌ రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Oppo F25 Pro 5G : ఒప్పో F25 Pro 5G వచ్చేస్తుంది.. ఫీచర్స్, ధర ఎంతంటే?