ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ రాబోతుంది.. ఒప్పో నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతోంది. ఫిబ్రవరి 29న కొత్త ఒప్పో ఎఫ్25 ప్రో 5జీ ఫోన్ లాంచ్ కానుంది.. ఈ ఫోన్ గురించి కంపెనీ ఎప్పుడో పేర్కొంది.. దేశంలో ఈ కొత్త 5జీ ఫోన్ ధరను కాన్ఫిగరేషన్‌లతో పాటు చిప్‌సెట్, బ్యాటరీ, ఓఎస్ వివరాల వంటి కొన్ని ఇతర స్పెసిఫికేషన్‌లను రివీల్ చేసింది. ఒప్పో ఇండియా ల్యాండింగ్ పేజీలో మోడల్ రెండో కలర్ ఆప్షన్ కూడా ఉందని చెప్పింది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ ఫోన్ ఫీచర్స్ ఎప్పుడూ ఆన్ లైన్ లో కనిపించాయి.. ఒప్పో ఎఫ్25 ప్రో 5జీ మోడల్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని ఒప్పో ఇప్పటికే ధృవీకరించింది.
64ఎంపీ ప్రైమరీ సెన్సార్, అల్ట్రావైడ్ లెన్స్‌తో కూడిన 8ఎంపీ సెన్సార్, 2ఎంపీ మాక్రో షూటర్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో కూడా వస్తుంది. ఫ్రంట్ కెమెరా 32ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అమెజాన్ మైక్రోసైట్‌తో సహా ఒప్పో ఎఫ్25 ప్రో 5జీ ఆన్‌లైన్ లిస్టులలో ఉండనుంది. ఈ ఒప్పో ఫోన్ 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది… ఇంకా ఎన్నో ఫీచర్స్ ను కలిగి ఉంది..
ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. ఒప్పో ఎఫ్25 ప్రో 5జీ ఫోన్ 8జీబీ + 128జీబీ, 8జీబీ + 256జీబీ వేరియంట్‌లకు వరుసగా ధర రూ. 22,999, రూ.24,999 ఉండనుంది. కస్టమర్‌లు కూడా 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌కు పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ నిబంధనలు, షరతుల గురించి వివరించలేదు.. అలాగే ఆండ్రాయిడ్ 14-ఆధారిత యూఐ అవుట్-ఆఫ్-ది-బాక్స్ ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ 1,100నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో ఫుల్-హెచ్‌డీ+ 10-బిట్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుందని అంచనా.. మరో నాలుగు రోజుల్లో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది..