NTV Telugu Site icon

SLBC Incident: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై పిల్..

Slbc

Slbc

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. టన్నెల్‌లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలంటూ పిల్ దాఖలు చేశారు. నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్‌ ఈ పిల్‌ దాఖలు చేసింది. ఘటన జరిగి 10 రోజులైనా కార్మికుల ఆచూకీ లేదని పిటిషనర్ పేర్కొన్నారు. కాగా.. కేసులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. టన్నెల్‌ సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్‌ఎఫ్ పాల్గొన్నాయని ఏజీ న్యాయస్థానానికి తెలిపారు. 24 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని ఏజీ వెల్లడించారు. సహాయక చర్యలు ప్రభుత్వం సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో.. ఏజీ వివరాలను హైకోర్టు నమోదు చేసింది. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణను ముగించింది.

Read Also: TG Govt: ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో ముందడుగు..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పని సమయంలో సంభవించిన ఘోర ప్రమాదం ఇంకా అందరినీ కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో టన్నెల్ లోపల 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. నీటి ముంపు, టన్నెల్ కూలిన కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటి నుంచి ఈ ఘటనకు సంబంధించిన రక్షణ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. కాగా.. శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ టన్నెల్లో ప్రమాదం జరిగిన ఏడు రోజుల తర్వాత కార్మికుల మృతదేహాలను రెస్క్యూ టీం గుర్తించింది. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ మెషీన్ ద్వారా మట్టిలో కూరుకుపోయిన ఐదు మృతదేహాలను గుర్తించారు. మిగతా ముగ్గురి మృతదేహాల కోసం రెస్క్యూ టీం గాలిస్తున్నారు.

Read Also: Sonakshi Sinha : ఇండియాలో మాత్రం చచ్చినా బికినీ వేసుకోను..