కోలివుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా సినిమాలు తీసి స్టార్ హీరో పేరు తెచ్చుకున్నారు.. ఇండస్ట్రీలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోగా బాగానే పాపులారిటిని సంపాదించుకున్నారు.. తమిళ్ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుడిగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న హీరోలలో అజిత్ స్టైల్ వేరే.. చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఇప్పటికీ సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే కాదు.. వ్యక్తిగతంగా మొబైల్ ఉపయోగించని ఏకైక హీరో అజిత్. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడం షూటింగ్స్ నుంచి బ్రేక్ దొరికితే తనకెంతో ఇష్టమైన బైక్ రైడింగ్ చేయడం అజిత్ అలవాటు.
ఇప్పటికే బైక్ పై ఎన్నో దేశాలను చుట్టేసిన ఈ హీరో.. త్వరలోనే ప్రపంచాన్ని చూట్టేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక నెట్టింట ఈహీరోకు అస్సలు ఎలాంటి ఖాతాలు లేవు. అజిత్ గురించిన సమాచారాన్ని అతని మేనేజర్ మాత్రమే పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా అజిత్ న్యూలుక్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి… ఆ ఫోటోలలో కాస్త యంగ్ గా కనిపిస్తున్నారు..అజిత్ చెన్నై విమానాశ్రయంలో కనిపించారు అజిత్. వెంటనే అక్కడున్న అభిమానులు తమ హీరోను ఫోటోస్, వీడియోస్ తీసి నెట్టింట షేర్ చేయగా.. తెగ వైరలవుతున్నాయి.
అందులో అజిత్ తన లగేజీని తీసుకుని విమానంలోకి వెళ్తూ కనిపించారు. రెడ్ పోలో.. నెక్ టీ షర్ట్.. జీన్స్లో నెరిసిన జుట్టు, లైట్ గా గడ్డంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. 52ఏల్ల వయసులోనూ స్టైలీష్ లుక్లో చిరునవ్వుతో మాయ చేస్తున్నాడు అజిత్.. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. తెగింపు తర్వాత తన కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు అజిత్. ఇటీవలే స్విట్జర్లాండ్ వెళ్లిన ఆయన..ఇప్పుడు చెన్నై తిరిగి వచ్చినట్లుగా తెలుస్తోంది. అజిత్ ప్రస్తుతం డైరెక్టర్ మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ఓ చేస్తున్నారు. ఆగస్ట్ మూడో వారంలో ఈ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. భారీ బడ్జెట్ తో ఈ ను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. నవంబర్ లో తన వరల్డ్ టూర్ ను స్టార్ చేయనున్నారని సమాచారం..
Latest Exclusive Video Of AK 😎
The Majestic walk of #AjithKumar#VidaaMuyarchi pic.twitter.com/tHBw2Rrsaq
— AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) July 26, 2023