AP Crime: హైస్కూల్లో దారుణం.. తరగతి గదిలో సహచర విద్యార్థినిపై అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి హైస్కూల్లో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి మార్కుల మెమోను తీసుకెళ్లేందుకు స్కూల్‌కు వచ్చిన బాలికను తోటి విద్యార్థి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మండవల్లి మండలంలో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఓ గ్రామానికి చెందిన బాలిక ఉత్తీర్ణత సాధించింది. ఈ క్రమంలోనే ఈ నెల 15న మార్కుల మెమోను తీసుకునేందుకు పాఠశాలకు వెళ్లింది.
Read Also: Accident: నిర్మల్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురు సీరియస్..!
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
టీచర్లు అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్తుండగా.. మాటువేసిన తోటి విద్యార్థి బాలికను తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ సంఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్లో వీడియో తీశారు. బాలికకు వీడియో చూపించి తమ కోరికను తీర్చాలని బలవంతం చేశారు. అనంతరం తమకు డబ్బులు ఇవ్వాలంటూ బాధితురాలి తల్లిదండ్రులను బెదిరించారు. రూ.2లక్షలు ఇస్తామని బాధితురాలి తల్లిదండ్రులు ప్రాధేయపడినా.. ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు వీడియోను వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యాచారానికి ఒడిగట్టిన బాలుడిని అదుపులోకి తీసుకొని విజయవాడ జువైనల్ హోమ్‌కు తరలించారు. వీడియోను గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసిన నలుగురిని అరెస్ట్ చేసి కైకలూరు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.
తాజావార్తలు
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!