Site icon NTV Telugu

Harassment : చదువేమో పీహెచ్‌డీ గ్రాడ్యుయేట్‌.. చేసేది చిన్నారుల లైంగిక వేధింపులు

Harassmentv

Harassmentv

చదువుకున్న వారికి సమాజంలో ఎంతో గౌరవం ఉంటుందనే ఒకప్పటి మాట. ఎందుకంటే.. చదువులేని వారికి జ్ఞానం లేదని, సమాజంలో విధివిధానాలు తెలియవని.. తోటి వారి జీవించేస్థాయిలో తక్కువగా చూసేవారు. కానీ.. ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న విద్యావంతులే చెడుదార్లలో అడుగులు వేస్తున్నారు. అలాంటి ఘటనే ఇది.. తమిళనాడులోని తంజావూరుకు చెందిన 35 ఏళ్ల పీహెచ్‌డీ గ్రాడ్యుయేట్‌ను బాలికలపై అత్యాచారం చేసిన ఆరోపణలపై సీబీఐ అరెస్టు చేసింది. తంజోర్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి పిల్లలపై లైంగిక వేధింపుల వీడియోలు మరియు ఫోటోలను విక్రయిస్తున్నాడు.

Also Read : Viral : మత్తులో ముగ్గురు యువతులు వీరంగం.. తగ్గేదెలే అంటూ..

అలాగే బాలికలపై లైంగిక దాడికి పాల్పడి వీడియో తీసి బెదిరించి పదే పదే అత్యాచారం చేసి వీడియో, ఫోటో అమ్మేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ ఆయన ఇంటిపై దాడులు చేసింది. ఆ సమయంలో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. నిందితుడు గత నాలుగేళ్లుగా చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు సీబీఐ పేర్కొంది. దాన్ని వీడియో, ఫొటోలు తీసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశాడు. నిందితుడు ఒక బాలికతో సహా ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి చేసినట్లు గుర్తించారు. అయితే.. బాధితులు ఈ విషయం బయట పెడితే వారి వీడియోలను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేస్తానని బెదిరించినట్లు సీబీఐ పేర్కొంది. దీంతో సీబీఐ అతడిని అరెస్ట్ చేసి సీరియస్ గా విచారణ జరుపుతోంది.

Also Read : Road Accident: తుని దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా..

Exit mobile version