Petrol Price: దేశంలో ప్రస్తుతం ఇంధన ధరలు మండిపోతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులకు మోత మోగిస్తుంటే.. మరోవైపు ఈ పెట్రోల్ రేట్లు కూడా వాహనదారులకు గుదిబండగా మారాయి. పెట్రోల్, డీజిల్ కొనాలంటే ధరలు చుక్కలు కనిపిస్తున్నాయి. అంటే ఈ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం పెట్రోల్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. అలా జరిగితే రూ.15 కే పెట్రోల్ వస్తుందని అన్నారు. దీని వల్ల రైతులకే మేలు జరుగుతుందని అన్నారు.
Also Read: New Born Sold for Rs.800: రూ.800 కోసం 8 నెలల చిన్నారిని అమ్మేసిన కసాయి తల్లి
వెహికల్స్‌ను పూర్తిగా ఇథనాల్‌తో నడిచే వీలుగా, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యం కల్పించేలా కేంద్రం ఎప్పటినుంచో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఒక బహిరంగ సభకు హాజరైన ఆయన పెట్రోల్ రేట్లపై మాట్లాడారు. ఇక ఇథనాల్, కరెంట్ లభ్యతను బట్టి చూస్తే భవిష్యత్తులో రూ.15 కే లీటర్ పెట్రోల్ లభిస్తుందని అన్నారు. భవిష్యత్తులో అన్ని వాహనాలు రైతులు ఉత్పత్తి చేసిన ఇథనాల్‌తోనే నడుస్తాయని నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాలుష్యం, దిగుమతులను తగ్గించడమే కాకుండా రూ.16 లక్షల కోట్ల భారీ దిగుమతుల వ్యయాన్ని రైతుల కుటుంబాలకు మళ్లించవచ్చని ఆయన హైలైట్ చేశారు.
Also Read: PM Modi: వరంగల్‌కు ప్రధాని.. రూ.6,100 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన.. వివరాలు ఇవే
” సగటున 60 శాతం ఇథనాల్.. 40 శాతం ఎలక్ట్రిసిటీ (విద్యుత్) వినియోగిస్తే అప్పుడు పెట్రోల్ రూ. 15 కే లీటర్ వస్తుంది. దీని వల్ల ప్రజలు లబ్ధి పొందుతారు. ఇంకా కాలుష్యం తగ్గుతుంది. దిగుమతుల భారం కూడా తగ్గుతుంది. ఈ దిగుమతులకు అయ్యే రూ. 16 లక్షల కోట్లు నేరుగా రైతుల ఇళ్లకు చేరతాయి.” అని వ్యాఖ్యానించారు గడ్కరీ. కేంద్ర మంత్రి అంతకుముందు రోజు మంగళవారం .. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లోనే సుమారు రూ.5600 కోట్ల విలువైన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించారు. మొత్తం 219 కి.మీ పొడవు, రూ. 3,775 కోట్ల వ్యయంతో నాలుగు జాతీయ రహదారి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. వాటిలో అజ్మీర్, భిల్వారా జిల్లాలకు కనెక్టివిటీని మెరుగుపరచడానికి జాతీయ రహదారి 48పై కిషన్‌గఢ్ నుండి గుల్బాపురా వరకు ఆరు లేన్ల విభాగం ఉంది. రాజస్థాన్‌లో సెంట్రల్ రోడ్స్ ఫండ్ కింద రూ. 2,250 కోట్ల వ్యయంతో 74 ప్రాజెక్టులకు ఆమోదం కూడా ఈ కార్యక్రమంలో ప్రకటించారు.
