దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఆయా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలపై వడ్డన ప్రారంభించాయి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెంచేయగా.. తాజాగా గోవా రాష్ట్రం కూడా అదే జాబితాలో చేరింది. గోవా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ పెంపును ప్రకటించింది. పెట్రోల్ ధర రూ.1, డీజిల్ ధరను 60 పైసలు పెంచుతూ.. స్టేట్ గవర్నమెంట్ అండర్ సెక్రటరీ ప్రణబ్ జి భట్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ధరల పెరుగుదల జూన్ 22 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: The Goat : ‘ది గోట్ ’ సెకండ్ సింగిల్ సాంగ్ వచ్చేసిందోచ్..
ధరల పెరుగుల తర్వాత గోవాలో లీటరు పెట్రోల్ ధర రూ. 95.40, డీజిల్ రూ. 87.90 దగ్గర ఉంది. కర్ణాటకలో అయితే పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ. 3, రూ. 3.5 పెంచుతూ గత వారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ధరల పెంపుపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.
ఇది కూడా చదవండి: TDPP Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీపీ భేటీ
ఇప్పటికే కూరగాయల ధరల పెంపుతో ప్రజలు అల్లాడిపోతుంటే.. ఇప్పుడు మరో రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పెంపుతో ప్రజల నుంచి రాబడి బట్టడంతో పేదలు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో కిలో టమోటా వంద రూపాయులు ఉండగా.. మిగతా కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నింటాయి.
ఇది కూడా చదవండి: Lic Plan : ఈ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ. 12 వేలు పొందోచ్చు.. ఎలాగంటే?