Site icon NTV Telugu

Petrol&Diesel Price: వార్ ఎఫెక్ట్.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు రేటు ఎంత?

Pakistan Petrol Price

Pakistan Petrol Price

మిడిల్ ఈస్ట్ లో చోటుచేసుకున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్‌పై ప్రభావం చూపుతున్నాయి. పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రాత్రికి రాత్రే గణనీయంగా పెరిగాయి. పెట్రోల్, హై-స్పీడ్ డీజిల్ ధర లీటరుకు 55 పాకిస్తానీ రూపాయలు పెరిగింది. పాకిస్తాన్‌లో ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలో ఇదే భారీ పెరుగుదల.

Also Read:Best Bikes: లీటరుకు 70KM మైలేజ్.. రూ. 70,000 కంటే తక్కువ ధర.. ఈ బైక్స్ పైనే అందరి ఫోకస్

పాకిస్తాన్ న్యూస్ పోర్టల్ ది డాన్ నివేదిక ప్రకారం, శుక్రవారం-శనివారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో, పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్, ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్‌తో కలిసి పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ప్రకటించారు. పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ కూడా ఈ విలేకరుల సమావేశంలో ప్రజలకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నించారు, మన దగ్గర సరిపడ పెట్రోలియం నిల్వలు ఉన్నాయని తెలిపారు.

Also Read:Spectre I: మైక్రోఫోన్‌లను గుర్తించి ఆడియోను తక్షణమే బ్లాక్ చేసే డెవిలెన్స్ స్పెక్టర్ I.. ప్రైవసీకి ఢోకా లేదు!

పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ఎంత?

పాకిస్తాన్‌లో ధరల పెరుగుదల తర్వాత, 1 లీటర్ పెట్రోల్ ధర రూ. 321.17కి పెరిగింది, అయితే 1 లీటర్ డీజిల్ ధర రూ.335.86కి పెరిగింది. పాకిస్తాన్ తన ముడి చమురు కోసం పూర్తిగా దిగుమతులపై ఆధారపడి ఉంది. హార్ముజ్ జలసంధి ప్రతిష్టంభన పాకిస్తాన్‌కు చమురు సరఫరాకు అంతరాయం కలిగించింది. ధరలు మరింత పెరుగుతాయోమోనన్న ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ పంప్స్ కు క్యూ కట్టారు.

Exit mobile version