Site icon NTV Telugu

Fuel Prices: దేశంలో ఐదు నెలల తర్వాత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా సుదీర్ఘ విరామం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో సుమారు ఐదు నెలల తర్వాత ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా బ్యారెల్ చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇంధన ధరలు పెరగడం ప్రారంభించాయి.

తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.10, డీజిల్ ధర రూ.95.49గా ఉంది. మరోవైపు ఏపీలో లీటర్ పెట్రోల్‌పై 88 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరిగాయి. దీంతో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.80, డీజిల్ రూ.96.83గా నమోదైంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.21, డీజిల్ ధర రూ.97.26గా ఉంది. పెరిగిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి.

https://ntvtelugu.com/pan-card-and-aadhaar-card-linking-deadline-is-march-31st/
Exit mobile version