NTV Telugu Site icon

Petla Uma Sankara Ganesh : అయ్యన్నపాత్రుడు చరిత్ర అందరికి తెలుసు

Shankr

Shankr

ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. తాజాగా టీడీపీ నేతలపై నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన విశాఖలో మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు ఒక సైకో.. అయ్యన్నపాత్రుడు ఒక శాడిస్టు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా.. చంద్రబాబు, లోకేష్ పెద్ద సైకోలు అని ఆయన మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడు చరిత్ర అందరికి తెలుసునని ఆయన అన్నారు. నర్సీపట్నంను గంజాయి అడ్డాగా మార్చిన చరిత్ర అయ్యన్నదని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ ముఠా చంద్రబాబు అయ్యన్నపాత్రుడు అంటూ ఆయన ధ్వజమెత్తారు. అయ్యన్న కంటే మేము భూతులు మాట్లాడగలము అని ఆయన వ్యాఖ్యానించారు. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.

Also Read : Brutally Killed: కత్తులతో 282 సార్లు పొడిచి తల్లిదండ్రులను చంపిన కొడుకు

ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారని, జన్మభూమి కమిటీల్లా బ్రోకర్లు లేకుండా వాలంటీర్ల వ్యవస్థ పని చేస్తుందని ఆయన వెల్లడించారు. పొత్తుల లేకుండా ఎన్నికలు వెళ్లే ధైర్యం చంద్రబాబు ఉందా అని ఆయన ప్రశ్నించారు. 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఆయన అన్నారు. ఓడిపోతామని భయంతో అన్ని పార్టీల నేతలు ఇంటికి అయ్యన్నపాత్రుడు తిరుగుతున్నారని ఆయన అన్నారు. వెయ్యి మంది చంద్రబాబులు, లక్ష మంది అయ్యన్నపాత్రుడులు వచ్చిన జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరని ఆయన అన్నారు. 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. 470 కోట్ల రూపాయలతో తాండవ ఏలేరు కాలువ నదులను అనుసంధానం చేశారని ఆయన తెలిపారు.

Also Read : Chiranjeevi: మెగా తుఫాన్… మూడోసారి వంద కోట్లు