Online Betting: ఉత్తి పుణ్యానికే డబ్బులొస్తే మీరు ఏం చేస్తారు.. అందరికీ స్వీట్స్ పంపి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ఎక్కువగా డబ్బులొస్తే బీరు బిర్యానీలతో హ్యాపీ నెస్ ఎంజాయ్ చేస్తారు. కానీ ఓ వ్యక్తికి ఆన్ లైన్ బెట్టింగ్ లో భారీగా డబ్బు రావడంతో ఆనందంతో తప్ప తాగి వీధుల్లో బీభత్సం సృష్టించాడు. స్థానికులు ఆపినా.. తాను సీఎం చుట్టమని చెప్పి దురుసుగా ప్రవర్తించాడు. వాడి వికృత చేష్టలు తట్టుకోలేక పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఇంకేముంది మనోడిని పోలీసులు వచ్చి బరబరాలాగి జీపులేసుకుని తీసుకుపోయారు.
PM Kusum Yojana: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కుసుమ్ యోజన పొడిగింపు
వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లోని సిడ్కుల్ ప్రాంతానికి చెందిన మహేష్ సింగ్ ధామి అనే వ్యక్తి డ్రీమ్ 11 యాప్‌లో రూ.కోటి బహుమతి గెలుచుకున్నాడు. ఈ ఆనందంలో మద్యం తాగి వీధుల్లోకి వచ్చి దురుసుగా ప్రవర్తించాడు. అతడిని ఆపేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ మాట వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని వారు అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో తాను ముఖ్యమంత్రికి బంధువునని చెబుతూ హెచ్చరించాడు. పోలీసుల యూనిఫాం విప్పమంటూ వికృత చేష్టలకు దిగాడు. చివరకు అతణ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
Read Also: Boby Dog: ఇది మామూలు కుక్క కాదు.. గిన్నీస్ రికార్డ్ లోకి ఎక్కింది