Boby Dog: ఇది మామూలు కుక్క కాదు.. గిన్నీస్ రికార్డ్ లోకి ఎక్కింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boby Dog: ఈ కుక్క పేరు బాబీ. ఇది అలాంటి ఇలాంటి కుక్క కాదు. దీని పేరు మీద గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యధిక వయసు ఉన్న కుక్క. దీని వయసు ఎంతో తెలిస్తే మీరు షాక్ అయిపోవాల్సిందే. దీని వయసు అక్షరాలా 30ఏళ్ల 266 రోజులు. అంటే సుమారుగా 31 సంవత్సరాలు. అసలు కుక్కలు మా అంటే 10 ఏళ్లు లేదంటే కొన్నైతే 15 ఏళ్ల వరకు బతుకుతాయి. అంతకుమించి అవి బతకలేవు. కానీ.. ఈ కుక్క ఏకంగా 30 ఏళ్లు దాటినా ఇంకా ధృడంగా ఉంది. అత్యంత ఎక్కువ వయసుతో ఉండి బతికి ఉన్న కుక్కగా మరో రికార్డు కూడా ఇది క్రియేట్ చేసింది.
Read Also: Millets: గుడిసెలో నివసించే మహిళ.. ఇప్పుడు మిల్లెట్లకు బ్రాండ్ అంబాసిడర్
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ఇదివరకు ఈ రికార్డు బ్లూయే అనే కుక్క పేరు మీద ఉండేది. ఆ కుక్క 1910లో పుట్టి 1939లో చనిపోయింది. అంటే ఆ కుక్క 29 ఏళ్లు మాత్రమే బతికింది. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసి 30 ఏళ్ల బతికి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది బాబీ. దీని పేరు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించి దానికి సర్టిఫికెట్ కూడా అందించారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు.
Read Also: Fire In Mumbai : ముంబైలో భారీ అగ్నిప్రమాదం, అదుపులోకి రాని మంటలు
బాబీ యజమానులు పోర్చుగల్‌లోని కాంకెయిరోస్ గ్రామానికి చెందిన కోస్టా కుటుంబం. ఈ కుటుంబంలోని లియోనెల్ కోస్టా అనే కుర్రాడికి 8 ఏళ్లున్నప్పుడు బాబీ పుట్టింది. ఇంట్లో చాలా పెంపుడు కుక్కలుండటంతో కొన్నింటిని వదిలి పెట్టినా ఇది మాత్రం తప్పించుకుంది. ‘‘ఇంట్లో వాళ్లు తినేది ఏం పెట్టినా బాబీ తినేది. అనారోగ్య సమస్యల్లేకుండా హుషారుగా ప్రశాంతంగా ఉండేది. అదే దాని ఆయుష్షును పెంచి ఉంటుంది’ అంటారు కోస్టా. వయో భారంతో బాబీ ఇప్పుడు చురుగ్గా నడవలేకపోతోందట! చూపు కూడా తగ్గిందని కోస్టా చెప్పారు.
తాజావార్తలు
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..