Site icon NTV Telugu

Perni Nani: స్పీకర్‌కి మెడికల్ కాలేజీ కనిపించడం లేదంట.. వైఎస్ జగన్ వెళ్లి చూపిస్తారు!

Perni Nani

Perni Nani

స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆహ్వానం మేరకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం వెళ్తున్నారు అని.. పోలీసులు ఇప్పుడు అనుమతి లేదు అంటే స్పీకర్ అంటే గౌరవం లేదా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. స్పీకర్‌కి మెడికల్ కాలేజీ కనిపించడం లేదని, జగన్ వెళ్లి చూపిస్తారని విమర్శించారు. మెడికల్ కాలేజీకి సంబంధించిన జీవోను, నిర్మాణాలను, పనులు ఆపివేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా చూపిస్తామని తెలిపారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తప్పు అని కోటి సంతకాలతో ప్రజల అభిప్రాయాలు తీసుకుని గవర్నర్‌ను కలుస్తాం అని పేర్ని నాని చెప్పారు.

‘కూటమి ప్రభుత్వం శ్రీరంగ నీతులు చెప్పి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటోంది. 11 మెడికల్ కళాశాలలు అమ్మకానికి పెట్టారు. డబ్బు కోసం ఏ గడ్డైనా కరిచే వీళ్ల నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతాం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆహ్వానం మేరకు వైఎస్ జగన్ నర్సీపట్నం వెళ్తున్నారు. పోలీసులు అనుమతి లేదు అంటే స్పీకర్ అంటే గౌరవం లేదా?. స్పీకర్‌కి మెడికల్ కాలేజీ కనిపించడం లేదంట, జగన్ వెళ్లి చూపిస్తారు. ఆ జీవోను, నిర్మాణాలను, పనులు ఆపివేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా చూపిస్తాం. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తప్పు అని కోటి సంతకాలతో ప్రజల అభిప్రాయాలు తీసుకుని గవర్నర్‌ను కలుస్తాం’ అని పేర్ని నాని తెలిపారు.

Also Read: Vijayawada Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

‘కల్తీ లిక్కర్ మాఫియాపై మంత్రి కొల్లు రవీంద్ర ఎందుకు మాట్లాడటం లేదు. గతంలో డిస్ట్రలరీలో తయారు అయిన మద్యంపై విషం చిమ్మారు. ఇవాళ అదే డిస్ట్రలరీల నుంచే మద్యం వస్తుంటే ఏం చేస్తున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లా ఫ్రాంచైజీలు ఇచ్చారు. ఆఫ్రికా పంపి ట్రైనింగ్ ఇప్పించారు. డబ్బు కోసం అశుద్ధం తినటానికి అయినా సిద్ధంగా ఉన్నారు. దొంగలు ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. తప్పులు పనులతో అంటకాగిన వాళ్లకు లెక్కలతో సహా చెల్లిస్తాం అని జగన్ చెప్పారు. ఈ ప్రభుత్వానికి మంగళం పాడే సమయం వచ్చింది. 16 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం తయారీ జరుగుతుంటే మంత్రి కొల్లు రవీంద్ర ఏం చేస్తున్నాడు. వేర్ ఈజ్ ఎక్సైజ్ మినిస్టర్. మంత్రికి మూటలు వెళ్తున్నాయి, అందుకే సైలెంట్ గా ఉన్నాడు. ప్రజలు తిరగబడి తరిమి కొట్టే రోజులు వస్తాయి’ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

Exit mobile version