Perni Nani: స్పీకర్‌కి మెడికల్ కాలేజీ కనిపించడం లేదంట.. వైఎస్ జగన్ వెళ్లి చూపిస్తారు!
- వైసీపీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం వెళ్తున్నారు
- అనుమతి లేదు అంటే స్పీకర్ అంటే గౌరవం లేదా?
- స్పీకర్‌కి మెడికల్ కాలేజీ కనిపించడం లేదంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆహ్వానం మేరకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం వెళ్తున్నారు అని.. పోలీసులు ఇప్పుడు అనుమతి లేదు అంటే స్పీకర్ అంటే గౌరవం లేదా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. స్పీకర్‌కి మెడికల్ కాలేజీ కనిపించడం లేదని, జగన్ వెళ్లి చూపిస్తారని విమర్శించారు. మెడికల్ కాలేజీకి సంబంధించిన జీవోను, నిర్మాణాలను, పనులు ఆపివేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా చూపిస్తామని తెలిపారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తప్పు అని కోటి సంతకాలతో ప్రజల అభిప్రాయాలు తీసుకుని గవర్నర్‌ను కలుస్తాం అని పేర్ని నాని చెప్పారు.
‘కూటమి ప్రభుత్వం శ్రీరంగ నీతులు చెప్పి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటోంది. 11 మెడికల్ కళాశాలలు అమ్మకానికి పెట్టారు. డబ్బు కోసం ఏ గడ్డైనా కరిచే వీళ్ల నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతాం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆహ్వానం మేరకు వైఎస్ జగన్ నర్సీపట్నం వెళ్తున్నారు. పోలీసులు అనుమతి లేదు అంటే స్పీకర్ అంటే గౌరవం లేదా?. స్పీకర్‌కి మెడికల్ కాలేజీ కనిపించడం లేదంట, జగన్ వెళ్లి చూపిస్తారు. ఆ జీవోను, నిర్మాణాలను, పనులు ఆపివేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా చూపిస్తాం. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తప్పు అని కోటి సంతకాలతో ప్రజల అభిప్రాయాలు తీసుకుని గవర్నర్‌ను కలుస్తాం’ అని పేర్ని నాని తెలిపారు.
Also Read
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
Also Read: Vijayawada Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!
‘కల్తీ లిక్కర్ మాఫియాపై మంత్రి కొల్లు రవీంద్ర ఎందుకు మాట్లాడటం లేదు. గతంలో డిస్ట్రలరీలో తయారు అయిన మద్యంపై విషం చిమ్మారు. ఇవాళ అదే డిస్ట్రలరీల నుంచే మద్యం వస్తుంటే ఏం చేస్తున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లా ఫ్రాంచైజీలు ఇచ్చారు. ఆఫ్రికా పంపి ట్రైనింగ్ ఇప్పించారు. డబ్బు కోసం అశుద్ధం తినటానికి అయినా సిద్ధంగా ఉన్నారు. దొంగలు ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. తప్పులు పనులతో అంటకాగిన వాళ్లకు లెక్కలతో సహా చెల్లిస్తాం అని జగన్ చెప్పారు. ఈ ప్రభుత్వానికి మంగళం పాడే సమయం వచ్చింది. 16 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం తయారీ జరుగుతుంటే మంత్రి కొల్లు రవీంద్ర ఏం చేస్తున్నాడు. వేర్ ఈజ్ ఎక్సైజ్ మినిస్టర్. మంత్రికి మూటలు వెళ్తున్నాయి, అందుకే సైలెంట్ గా ఉన్నాడు. ప్రజలు తిరగబడి తరిమి కొట్టే రోజులు వస్తాయి’ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
తాజావార్తలు
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!