Perni Nani : కూటమి ప్రభుత్వంపై మరోసారి వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తప్పుడు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు గతంలో ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు. మనుషులను ప్రలోభాలకు గురి చేయడంలో చంద్రబాబుకు సరితూగే వ్యక్తి లేరని విమర్శించారు. కొనుగోలుదారులను సిద్ధం చేసి, బయానాలు ఇప్పించి, నేతలను రాజీనామా చేయించేందుకు ఒత్తిడి తెస్తారని ఆరోపించారు.
రాజీనామా చేసిన వారిని ఆమోదించమని సంబంధిత పార్టీలు అడగాలి, కానీ ఇక్కడ పరిస్థితి రివర్స్‌గా ఉందని అన్నారు. మా పార్టీ ఎమ్మెల్సీల రాజీనామాలు కూడా చంద్రబాబు రాజకీయ అనైతిక క్రీడలో భాగమేనని పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు చట్టాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో ఆరోగ్య కారణాలతో బెయిల్‌పై వచ్చారని, కానీ వెంటనే 18 గంటల ర్యాలీ నిర్వహించి, అప్పటి నుంచి ఆస్పత్రికి కూడా వెళ్లలేదని అన్నారు.
ఈ అవకాశాన్ని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఉపయోగించకుండా, వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టేందుకే ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి అంశంపై కూడా ఆయన చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అమరావతి విషయంలో రైతులను నట్టేట ముంచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. గతంలో జగన్ శాసన రాజధాని ఇదేనని స్పష్టంగా చెప్పారు, కాని చంద్రబాబు మాత్రం అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఈ శీతాకాలంలో టూర్ ఎక్కడికి వెళ్లాలి? ఇండియాలోని బెస్ట్ వింటర్ స్పాట్స్ ఇవే !