NTV Telugu Site icon

Perni Nani : చెప్పులు లేకుండా ఎండలో నడిచిన వృద్ధురాలు.. షోరూంకు తీసుకెళ్లిన పేర్ని నాని

Perni Nani

Perni Nani

భగ్గుమంటోన్న భానుడి ప్రభావంతో.. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటే ఒకటికి పదిసార్లు జనం ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఇప్పటికే నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. అయితే నడి రోడ్డుమీద ఓ వృద్ధురాలు చెప్పులు లేకుండా నడుస్తుంది. అటుగా వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఓ వృద్ధురాలి పట్ల పెద్ద మనసు ప్రదర్శించారు. మచిలీపట్నంలో కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలిని చూసి ఆయన చలించిపోయారు. ఆమెకు చెప్పులు కొనిచ్చి తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు.

Also Read : Recession: ఆర్థికమాంద్యం తప్పదు.. యూఎస్ ట్రెజరీ వార్నింగ్.. భారత ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలమే..!

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని కారులో అటుగా వెళుతున్నారు. ఎండదెబ్బకు జన సంచారం ఎక్కువగా లేని ఆ సమయంలో, వృద్ధురాలు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడస్తుండడం ఆయన దృష్టిని ఆకర్షించింది. వెంటనే కారు ఆపి, ఆ వృద్ధురాలి వివరాలను ఆయన కనుక్కున్నారు. ఆమె పేదరాలు అని గ్రహించిన పేర్ని నాని, ఆమెను ఓ పాదరక్షల షోరూంకు తీసుకెళ్లి, నచ్చిన చెప్పులు కొనిచ్చారు. చెప్పులు ఎలా ఉన్నాయమ్మా… లూజుగా ఉన్నాయా… సరిపోయాయా అంటూ అడిగి మరీ పేర్ని నాని తెలుసుకున్నారు. చెప్పులు కొనిచ్చిన ఎమ్మెల్యే పేర్ని నానికి సదరు వృద్ధురాలు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పేర్ని నాని చేసిన సహయంపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తుంది. పేదల పట్ల మీరు ప్రవర్తించే తీరు చాలా బాగుంది అంటూ నెటిజన్స్ మాజీమంత్రిపై కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : An Inhuman Incident : పెళ్లికి నిరాకరించిందని యువతికి గుండు కొట్టి…

Show comments