Site icon NTV Telugu

Kakarla Suresh: విభేదాలు వీడి ఐకమత్యంతో విజయం సాధిద్దాం..!

Kakarla

Kakarla

సీతారాంపురం మండల పరిధిలోని బాలాయపల్లి పంచాయతీ కోకర వారి పల్లి గ్రామంలో చింతం వారి నివాసంలో సీతారాంపురం మండలం టీడీపీ మండల కన్వీనర్ కె ప్రభాకర్ రాజు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కాగా, ఆత్మీయ సమావేశానికి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ఐకమత్యంతో అందరం కలిసికట్టుగా పనిచేసి ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా వేగర వేద్దాం అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మనందరి జీవితాలు మారుతాయి అన్నారు.

Read Also: Game Changer: పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడం లేదా?

ఇక, యువ నాయకుడు నారా లోకేష్ బాబు టెక్నాలజీని అందిపుచ్చుకొని ఉద్యోగ అవకాశాల కల్పనకై ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఉన్నారని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. వెనుకబడిన సీతారాంపురం మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని కాకర్ల తెలిపారు. మమతాను రాగాలకు ఆప్యాయతకు పుట్టినిల్లు సీతారాంపురం అన్నారు. మీ కష్టాలు చూస్తే మనసు తరుక్కుపోతుందని త్వరలోనే మీ కష్టాలు తీరుస్తానని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి ఉమ్మడి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకార్ల సురేష్ పిలుపునిచ్చారు.

Read Also: TDP vs Janasena: తిరుపతిలో అనూహ్య పరిణామాలు.. జనసేన పోటీపోటీ సమావేశాలు..! టీడీపీ రహస్య భేటీ..!

ఇక, కాకర్ల ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేశానని అధికారం వస్తే ఈ ప్రాంతాన్ని టూరిజంగా మారుస్తాను అని కాకార్ల సురేష్ అన్నారు. కనుక అందరు కలిసి కట్టుగా పని చేసి ఉమ్మడి ప్రభుత్వాన్ని తెచ్చుకొని వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపుదాం అని పేర్కొన్నారు. అనంతరం సీతారాంపురం మండలంలోని పంచాయతీల వారీగా ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పరిచయం చేసుకున్నారు. శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

Read Also: Om Bheem Bush: వసూళ్ల సునామీ సృష్టిస్తున్న శ్రీవిష్ణు మూవీ.. ఎన్ని కోట్లంటే?

ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, వరికుంటపాడు మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్, సీతారాంపురం మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కలివేల జ్యోతి, సీనియర్ నాయకులు చింతం శ్రీనివాసులు, జాషువా, భాగ్యమ్మ, ఇజ్రాయిల్, పిడుగు రమేష్, తురక వెంకటేశ్వర్లు, రమణయ్య, ఆదినారాయణ, మాలకొండయ్య, చంద్రా రెడ్డి, అబ్రహం, కరుణాకర్ ఇతర నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, బీజేపీ నాయకులు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version