Site icon NTV Telugu

Viral Video : పాపం బిర్యానీ తక్కువ పెట్టారు కాబోలు.. గిన్నెనే లేపుకెళ్లారు

Biryani

Biryani

Viral Video : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర చోరీ జరిగింది. ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు వ్యక్తులు రోడ్డుపై బిర్యానీ గిన్నెను తీసుకెళ్తుండడం వీడియోలో చూడవచ్చు. ఈ ఘటన మీరట్ లో చోటు చేసుకుంది. అయితే వారు బిర్యానీని ఎందుకలా చోరీ చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల తొలి విడుత ఈ రోజు జరిగింది. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయవతి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read Also:Rat : ఎంత పని చేశావే ఎలుక.. నీ వల్ల రూ.67వేలు లాస్

ఈ క్రమంలోనే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మీరట్‌లో ఓ రాజకీయ నేత బిర్యానీ పంపిణీ చేపట్టినట్టుగా తెలుస్తోంది. మీరట్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ సమీపంలో బిర్యానీ వడ్డిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఓ గుంపు బిర్యానీ గిన్నె పట్టుకుని దానితో అక్కడి నుంచి పరుగెత్తినట్లు కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు విచారణ జరుపుతున్నారు. మీరట్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఒకరు బిర్యానీ పంపిణీ చేసినట్టుగా పలు వార్తా సంస్థలు రిపోర్టు చేస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో కార్లిటీ రావాల్సి ఉంది.

Read Also:Ladies Romance: బైక్ పై ముద్దులతో రెచ్చిపోయిన అమ్మాయిలు.. అబ్బాయిలకు మించి రొమాన్స్

Exit mobile version