Site icon NTV Telugu

Rajnath Singh: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మాదే.. ఎవరు ఆందోళన పడొద్దు..

Rajnath Singh

Rajnath Singh

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జరిగిన ర్యాలీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు భారత్‌తో కలిసి జీవించాలని డిమాండ్ చేస్తారని అన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు.. పీఓకే మాదే, అలాగే ఉంటుందన్నారు. భారతదేశం యొక్క బలం పెరుగుతోంది.. భారతదేశ ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా డెవలప్మెంట్ అవుతుందన్నారు. మన ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది.. ఇప్పుడు పీఓకేలోని మన సోదరులు, సోదరీమణులు స్వయంగా మనతో కలిసి రావాలని డిమాండ్ చేస్తున్నారని రాజ్ నాత్ సింగ్ వెల్లడించారు.

Read Also: Suriya-Jyothika: 18 ఏళ్ల తర్వాత.. ఆఫ్‌స్క్రీన్‌, ఆన్‌స్క్రీన్‌ హిట్‌ జోడీ!

కాగా, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జరిగిన బహిరంగ సభలో కేంద్రమంత్రి రాజ్ సింగ్ సింగ్ ప్రసంగిస్తూ.. పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు చాలా వరకు క్షీణించాయన్నారు. మీరు ఏదైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే, మొదట అక్కడ శాంతిభద్రతలు, పరిస్థితిని అదుపులోకి తీసుకు రావాలన్నారు. అలాగే, సందేశ్‌ఖాలీలో జరిగిన సంఘటనలను చూస్తుంటే.. బెంగాల్ లో మహిళలకు మమతా బెనర్జీ ప్రభుత్వం భద్రత కల్పించడం లేదు అనే విషయం అర్థం అవుతుందన్నారు. ఇక, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ సియాచిన్‌కు బయల్దేరి అక్కడి ప్రాంతంలో మోహరించిన సాయుధ బలగాలతో మాట్లాడనున్నారు. అలాగే, పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. డార్జిలింగ్‌లో ఏప్రిల్ 26వ తేదీన రెండో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

Exit mobile version