‘ప్రజాగళం’ సభ యావత్ ప్రాంగణం పెమ్మసాని ప్రభంజనంతో మార్మోగింది. స్వాగత సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఉంచిన ఫ్లెక్సీలు, తోరణాలతో పాటు కటౌట్లు సభ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కోరుతూ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఆధ్వర్యంలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభను చిలకలూరిపేట వద్ద గల బొప్పూడి ప్రాంతంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Read Also: Murder: అందరూ చూస్తుండగానే కాల్పులు.. ఆపై..?
కాగా.. సభ ఏర్పాట్ల నిమిత్తం పెమ్మసానికి టీడీపీ అధిష్టానం పలు బాధ్యతలను అప్పగించింది. అలంకరణ కమిటీ కో-ఆర్డినేటర్గా నియోజకవర్గ ఇంఛార్జిలు, నాయకులను సమన్వయం చేసుకుంటూ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన బాధ్యతలను నిర్వహించారు. ఆ ఏర్పాట్లలో భాగంగా విజయవాడ మొదలు బొప్పూడి వరకు సుమారు 75 కి.మీ.ల మేర ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు చూపరులకు కనుల విందు చేశాయి. సభ వద్దకు వెళ్లిన వాహనదారులు అభిమానులు, నాయకులు జాతీయ రహదారికి ఇరు వైపులా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూస్తూ.. జై టీడీపీ, జై పెమ్మసాని అంటూ చేసిన నినాదాలతో రహదారులు మార్మోగాయి.
Read Also: S Jaishankar: సీఏఏపై అమెరికా అత్యుత్సాహం.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన జైశంకర్..