Site icon NTV Telugu

Pele Death: సాకర్ కింగ్ పీలేకు.. ప్రధాని మోదీ సంతాపం

Pele Death

Pele Death

Pele Death: బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే (82 ) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా పెద్ద పేగు క్యాన్సర్ తో బాధపడతున్న ఆయన గురువారం అర్ధరాత్రి మరణించారు. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం సందర్భంగా ఫుట్‎బాల్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పీలే మృతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులతోపాటు క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళలర్పిస్తున్నారు.

Read Also: Zero Covid Cases: ఆ రెండు దేశాల్లో కరోనా లేదు.. కారణం ఏంటో తెలుసా?

సాకర్ కింగ్ పీలే మృతికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సంతాపం తెలిపారు. అతని అత్యుత్తమ క్రీడా ప్రదర్శనలు, విజయం రాబోయే తరాలకు స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు. పీలే మరణం క్రీడా ప్రపంచానికి తీరని లోటుగా అభివర్ణించారు మోదీ. అతని అత్యుత్తమ క్రీడా ప్రదర్శనలు, విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో రాశారు.

Read Also: Japan Dog Man: కుక్క బతుకు బాగుంటుంది అనుకుంటే.. నిజంగానే కుక్క బతుకైంది

పీలే అంత్యక్రిలను మంగళవారం(జనవరి 3) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం పీలే భౌతికకాయాన్ని ఆసుపత్రి నుంచి క్లబ్ ఎస్టాడియో అర్బానో కాల్డెయిరాకు తరలిస్తారు. అక్కడ అభిమానుల సందర్శనార్థం పీలే శవపేటికను పిచ్ మధ్యలో ఉంచుతారు. మంగళవారం పీలే కుటుంబ ప్రైవేట్ సమాధి వద్దకి సావో పాలోలోని శాంటోస్ వీధుల మీదుగా ఊరేగింపు ఉంటుంది.

Exit mobile version