Peedika Rajanna Dora: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఎన్ని ఎకరాలు ఇళ్ల పట్టాల కోసం ఇచ్చారో చెప్పాలంటూ చంద్రబాబును ఏపీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ప్రశ్నించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు. రాష్ట్రంలో 17 వేల ఎకరాల్లో కాలనీలు కడుతున్నామన్న రాజన్న దొర.. అమరావతిలో 54 వేల మందికి భూమి ఇస్తే చంద్రబాబు అలా మాట్లాడడం తగదన్నారు. సెంటు భూమి ఇస్తే శవాన్ని పాతడానికా అంటూ.. ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ శవాన్ని పాతడానికి మేము అనొచ్చు కానీ మేము అలా అనలేమమన్నారు.
Read Also: Kejriwal : అందుకే పీఎం చదువుకున్న వాడై ఉండాలనేది : కేజ్రీవాల్
మీరు 14 ఏళ్లలో చేయలేని పనులు.. వైసీపీ సర్కారు నాలుగు సంవత్సరాల్లో చేసిందన్నారు. పొత్తుల కోసం మీరు సీపీఎం, సీపీఐ, బీజేపీ, జనసేన పార్టీల నాయకుల కాళ్లు పట్టుకుట్టున్నారన్న ఆయన.. మాకు ఆ అవసరం లేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సింహం లాగా సింగిల్‌గానే వస్తారన్నారు. జగన్ 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగానే ఉంటారని ఆయన చెప్పారు.
